ముంబై: ఈ ఏడాది జరగబోయే టి20 ప్రపంచకప్ టోర్నీలో భారత సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి బరిలోకి దిగే అవకాశాలు మెరుగయ్యాయి. 14 నెలల తర్వాత ఈ దిగ్గజాలిద్దరు మళ్లీ టి20 జట్టులోకి ఎంపికయ్యారు. చివరిసారిగా 2022 నవంబర్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో వీరిద్దరు ఆడారు. తదనంతరం పూర్తిగా టెస్టు, వన్డే ప్రపంచకప్ కోసం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యారు. అఫ్గానిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును ఆదివారం ప్రకటించగా... విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ జట్టులోకి వచ్చారు.
తాజా ఎంపికతో వీరిద్దరు ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్–అమెరికాలలో జరిగే టి20 ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగమవుతారని సీనియర్ సెలక్షన్ కమిటీ సూచనప్రాయంగా తెలిపింది. టి20 ఫార్మాట్‌లో ఇటీవల భారత జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌లతోపాటు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయాల కారణంగా అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు దూరమయ్యారు. హైదరాబాద్ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జనవరి 11న తొలి టి20 మొహాలీలో... 14న ఇండోర్‌లో రెండో టి20... 17న బెంగళూరులో మూడో టి20 మ్యాచ్ జరుగుతాయి. ఈ ఏడాది వెస్టిండీస్–అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడే చివరి అంతర్జాతీయ సిరీస్ ఇదే అవుతుంది. అనంతరం భారత ఆటగాళ్లు ఐపీఎల్‌తో మ్యాచ్ ప్రాక్టీస్ పొందుతారు.
భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెపె్టన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కోహ్లి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, సంజూ సామ్సన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్‡్షŠదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment