అండర్‌ 19 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ విడుదల | Schedule Announced For ICC U19 Womens T20 World Cup 2025 | Sakshi
Sakshi News home page

అండర్‌ 19 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ విడుదల

Published Sun, Aug 18 2024 5:51 PM | Last Updated on Sun, Aug 18 2024 7:29 PM

Schedule Announced For ICC U19 Womens T20 World Cup 2025

మలేషియాలో జరగబోయే మహిళల అండర్‌ 19 టీ20 వరల్డ్‌కప్‌ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్‌ 18) ప్రకటించింది. ఈ టోర్నీ 2025 జనవరి 18 నుంచి ప్రారంభమై.. ఫిబ్రవరి 2న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. నాలుగు జట్లు ఓ గ్రూప్‌గా విభజించబడి పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

భారత్‌ గ్రూప్‌-ఏలో వెస్టిండీస్‌, శ్రీలంక మలేషియాలతో పోటీపడనుంది. గ్రూప్‌-బిలో ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, ఐర్లాండ్‌, యూఎస్‌ఏ జట్లు ఉన్నాయి. గ్రూప్‌-సిలో న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్రికా క్వాలిఫయర్‌, సమోవా దేశాలు పోటీపడనున్నాయి. గ్రూప్‌-డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఆసియా క్వాలిఫయర్‌, స్కాట్లాండ్‌ జట్లు పోటీపడనున్నాయి. భారత్‌.. జనవరి 19న వెస్టిండీస్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement