Retirement Can Wait! Rohit Sharma Drops Major Hint With 2024 T20 World Cup Comment - Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌పై కీలక కామెంట్‌ చేసిన రోహిత్‌ శర్మ

Published Sun, Aug 6 2023 7:25 PM | Last Updated on Mon, Aug 7 2023 9:50 AM

Retirement Can Wait, Rohit Sharma Drops Major Hint With 2024 T20 World Cup Comment - Sakshi

భారత టెస్ట్‌, వన్డే జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (36) రిటైర్మెంట్‌పై గతకొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరికి తోచిన విధంగా వారు హిట్‌మ్యాన్‌ రిటైర్మెంట్‌పై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ అంశంపై హిట్‌మ్యాన్‌ తాజాగా అమెరికాలో జరిగిన కార్యక్రమం సందర్భంగా స్పందించాడు.

తాను ఇప్పట్లో రిటైర్‌ కావట్లేదని అతను క్లారిటీ ఇచ్చాడు. అంతే కాదు వచ్చే ఏడాది అమెరికా, కరీబియన్‌ దీవుల్లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు కూడా అందుబాటులో ఉంటానని చెప్పకనే చెప్పాడు. ఇది తెలిసి అతని అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 

రోహిత్‌ తన రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసి రోహిత్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే, అతని వ్యతిరేకులు పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు రోహిత్‌ వయసు 36.. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ నాటికి అతనికి 37 వస్తాయి.. ఆ వయసులో అతను బరిలోకి దిగుతాడని అనుకోవట్లేదంటూ నెగిటివ్‌ కామెంట్లు చేస్తున్నారు.   

ఇదిలా ఉంటే, గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి కూడా పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. రోహిత్‌.. వన్డే, టెస్ట్‌ కెప్టెన్సీలకు పరిమితం అయిన నేపథ్యంలో హార్ధిక్‌ పాండ్యా భారత టీ20 జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాడు.

రోహిత్‌, విరాట్‌లు టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించనప్పటికీ.. సెలెక్టర్లు వారిని ఎంపిక చేయకుండా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు సైతం సెలెక్టర్లు ఈ ఇద్దరిని ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో రోహిత్‌, విరాట్‌లు వచ్చే టీ20 వరల్డ్‌కప్‌ ఆడతారన్నది అనుమానమేనని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement