నేడు ఆస్ట్రేలియాతో భారత్ ‘సూపర్–8’ మ్యాచ్
ఆసీస్ గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవం
మ్యాచ్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు
రాత్రి గం. 8 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
గ్రాస్ ఐలెట్: టి20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు ఆస్ట్రేలియా రూపంలో నేడు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. గ్రూప్–1లో టాప్‌లో ఉన్న భారత జట్టు ఆసీస్‌పై నెగ్గితే దర్జాగా సెమీఫైనల్ చేరుకుంటుంది. రోహిత్, కోహ్లి, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ రాణిస్తే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. బుమ్రా, అర్‡్షదీప్ పేస్‌కు తోడు కుల్దీప్ స్పిన్ తోడైతే ఆ్రస్టేలియాకు కష్టాలు తప్పవు.
మరోవైపు భారత్‌పై గెలిచి సెమీఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవాలని ఆ్రస్టేలియా పట్టుదలతో ఉంది. అయితే భారత్, ఆ్రస్టేలియా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ రద్దయితే మాత్రం భారత్ ఐదు పాయింట్లతో సెమీఫైనల్ చేరుకుంటుంది. ఆస్ట్రేలియా సెమీస్ చేరే అవకాశాలన్నీ అఫ్గానిస్తాన్–బంగ్లాదేశ్ మధ్య మంగళవారం ఉదయం కింగ్స్‌టౌన్‌లో జరిగే మ్యాచ్‌పై ఆధారపడి ఉంటాయి.
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిస్తే ఆ్రస్టేలియా 3 పాయింట్లతో సెమీఫైనల్ చేరుతుంది. అఫ్గానిస్తాన్ గెలిస్తే ఆ జట్టు 4 పాయింట్లతో సెమీఫైనల్ చేరుకొని ఆ్రస్టేలియాను ఇంటిదారి పట్టిస్తుంది. ఒకవేళ భారత జట్టుపై ఆ్రస్టేలియా 41 పరుగుల తేడాతో గెలిచి... అఫ్గానిస్తాన్ జట్టు 81 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడిస్తే మాత్రం రన్‌రేట్‌లో వెనుకబడి టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
టి20 ప్రపంచకప్‌లో నేడు
దక్షిణాఫ్రికా X వెస్టిండీస్
వేదిక: నార్త్‌సౌండ్; ఉదయం గం. 6 నుంచి
భారత్ X ఆ్రస్టేలియా
వేదిక: గ్రాస్ ఐలెట్; రాత్రి గం. 8 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment