స్మిత్‌కు దక్కని చోటు | Australia T20 World Cup Team Announcement | Sakshi
Sakshi News home page

స్మిత్‌కు దక్కని చోటు

May 2 2024 3:55 AM | Updated on May 2 2024 3:55 AM

Australia T20 World Cup Team Announcement

టి20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన 

మెల్‌బోర్న్‌: కెరీర్‌లో ఐదో టి20 ప్రపంచకప్‌ ఆడాలని ఆశించిన ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌కు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే ఆ్రస్టేలియా జట్టును బుధవారం ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్‌‡్ష సారథ్యం వహిస్తాడు. 

గత 14 ఏళ్లలో ప్రపంచకప్‌ జట్టులో స్మిత్‌కు చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి. 2021లో టి20 ప్రపంచకప్‌ను తొలిసారి సాధించిన ఆ్రస్టేలియా జట్టులో స్మిత్‌ సభ్యుడిగా ఉన్నాడు. 34 ఏళ్ల స్మిత్‌ ఇప్పటివరకు ఆసీస్‌ తరఫున 67 టి20 మ్యాచ్‌లు ఆడి 125.45 స్ట్రయిక్‌రేట్‌తో 1094 పరుగులు సాధించాడు.   

ఆ్రస్టేలియా జట్టు: మిచెల్‌ మార్‌‡్ష (కెప్టెన్‌), వార్నర్, ట్రావిస్‌ హెడ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, కామెరాన్‌ గ్రీన్, టిమ్‌ డేవిడ్, నాథన్‌ ఎలిస్, జోష్‌ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్, కమిన్స్, హేజల్‌వుడ్, స్టార్క్, ఆష్టన్‌ అగర్, ఆడమ్‌ జంపా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement