Australian team
-
స్మిత్‌కు దక్కని చోటు
మెల్బోర్న్: కెరీర్లో ఐదో టి20 ప్రపంచకప్ ఆడాలని ఆశించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌కు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే ఆ్రస్టేలియా జట్టును బుధవారం ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఆల్‌రౌండర్ మిచెల్ మార్‡్ష సారథ్యం వహిస్తాడు. గత 14 ఏళ్లలో ప్రపంచకప్ జట్టులో స్మిత్‌కు చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి. 2021లో టి20 ప్రపంచకప్‌ను తొలిసారి సాధించిన ఆ్రస్టేలియా జట్టులో స్మిత్ సభ్యుడిగా ఉన్నాడు. 34 ఏళ్ల స్మిత్ ఇప్పటివరకు ఆసీస్ తరఫున 67 టి20 మ్యాచ్‌లు ఆడి 125.45 స్ట్రయిక్‌రేట్‌తో 1094 పరుగులు సాధించాడు. ఆ్రస్టేలియా జట్టు: మిచెల్ మార్‡్ష (కెప్టెన్), వార్నర్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్, కమిన్స్, హేజల్‌వుడ్, స్టార్క్, ఆష్టన్ అగర్, ఆడమ్ జంపా. -
కేటీఆర్‌తో ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సుసాన్ గ్రేస్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అరవింద్ కుమార్, జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణాన్ని వివరించారు. మౌలిక వసతులు, క్రీడలు, ఐటీ రంగాల్లో ఆస్ట్రేలియా కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. మహిళా వ్యాపారవేత్తల కోసం వి-హబ్ ఏర్పాటు చేసినందుకు కేటీఆర్‌ను సుసాన్ గ్రేస్ అభినందించారు. ఈ భేటీలో ట్రేడ్ కమిషనర్ మునీష్ శర్మ కూడా పాల్గొన్నారు. Hon'ble @AusCGChennai Ms Susan Grace met Minister @KTRTRS at Camp Office. Mr Munish Sharma, Trade Commissioner & Consul Australia Trade and Investment Commission, Mr Narsing Rao, IAS, Principal Secretary to CM, Prl Secretaries @arvindkumar_ias & @jayesh_ranjan were also present. pic.twitter.com/F8B7pTw2wL — Min IT, Telangana (@MinIT_Telangana) April 16, 2018 -
ఆస్ట్రేలియా ఆటగాళ్లపై రాయితో దాడి
ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. దీంతో బస్సు కిటికీ అద్దం పగిలిపోగా ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు. సోమవారం బంగ్లాదేశ్-ఆసీస్ మధ్య చిట్టగాంగ్ వేదికగా రెండోటెస్టు ప్రారంభమైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం హోటల్‌కు వెళ్లున్న ఆటగాళ్ల బస్సుపై ఎవరో రాయి విసిరారు. దీంతో అప్రమత్తమైన బంగ్లాదేశ్ సెక్యూరిటీ అధికారులు ఆ రూట్లో మరింత భద్రతను పెంచారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది.ఎవరో చిన్నరాయి విసిరారని, ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదని, ఈ విషయంపై బంగ్లా అధికారులతో చర్చించామని పేర్కొంది. రికీపాంటింగ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 2006లో తొలిసారి బంగ్లాలో పర్యటించిగా మళ్లీ ఇప్పుడే పర్యటిస్తుంది. 2015లో పర్యటించాల్సిఉండగా భద్రతా కారణాల వల్లే స్మిత్ సేన పర్యటనను రద్దు చేసుకుంది. ఇక తొలి టెస్టులో ఆసీస్‌పై బంగ్లా చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. -
అద్భుతాన్ని ఆశిస్తున్నాం
ఇక్కడ గెలిస్తే చిరకాలం గుర్తుండిపోతుంది ♦ అవసరమైతే స్లెడ్జింగ్ కూడా చేస్తాం ♦ కోహ్లి, అశ్విన్ కోసం వ్యూహాలున్నాయి ♦ సవాల్‌కు సిద్ధమన్న ఆసీస్ కెప్టెన్ స్మిత్ భారత గడ్డపై ఆడిన గత మూడు సిరీస్‌లలో చిత్తుగా ఓటమి... ఉప ఖండంలో వరుసగా తొమ్మిది టెస్టులలో పరాజయం... ముంబైలో అడుగు పెట్టే సమయానికి ఆస్ట్రేలియా జట్టును వెంటాడుతున్న తాజా రికార్డు ఇది. అటు వైపు ప్రత్యర్థి భారత్‌ను చూస్తే 19 మ్యాచ్‌లుగా పరాజయమే లేదు. వరుసగా ఆరు సిరీస్ విజయాలు... టెస్టుల్లో అగ్రశ్రేణి జట్లు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లు కూడా పోటీ ఇవ్వకుండా తలవంచాయి. ఇలాంటి స్థితిలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతాన్ని ఆశిస్తున్నాడు. భారత్‌ను ఓడించగలమని నమ్ముతున్నాడు. నాలుగేళ్ల క్రితం క్లీన్‌స్వీప్‌కు గురైన జట్టులో సభ్యుడైన తాను, నాటి చేదు జ్ఞాపకాలను తుడిచేయాలని కోరుకుంటున్నాడు! ముంబై: భారత్‌తో సిరీస్ అంటే తమకు అతి పెద్ద సవాల్ అని, అయితే దానిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యాఖ్యానించాడు. రాబోయే ఆరు వారాల కఠిన పర్యటన కోసం తామంతా ఎంతో ఎదురు చూస్తున్నామని అతను చెప్పాడు. మంగళవారం జట్టు కోచ్ డారెన్ లీమన్‌తో కలిసి స్మిత్ మీడియాతో ముచ్చటించాడు. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆసీస్ జట్ల మధ్య జరిగే నాలుగో టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఈ నెల 23న పుణేలో మొదలవుతుంది. అంతకు ముందు ఈ నెల 17నుంచి 19 వరకు జరిగే మూడు రోజుల మ్యాచ్‌లో భారత్ ‘ఎ’తో ఆస్ట్రేలియా తలపడుతుంది. ఈ సిరీస్‌లో తమ విజయావకాశాలు, ప్రత్యర్థి బలాబలాల గురించి అతను సుదీర్ఘంగా మాట్లాడాడు. ‘ఇది అంత సులువైన సిరీస్ కాదని మాకందరికీ బాగా తెలుసు. అయితే ఈ సవాల్‌ను అధిగమించాలని పట్టుదలగా ఉన్నాం. భారత గడ్డపై ఆడటం చాలా కష్టమైన విషయం. కాబట్టి ఈ సిరీస్‌కు ఎంతో విలువ ఉంది. ఇక్కడ మేం ఏదైనా అద్భుతం చేయగలిగితే అది మా జీవితంలో అత్యుత్తమ క్షణంగా నిలిచిపోతుంది. 10–20 ఏళ్ల తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసుకొని దీని గురించి గర్వంగా చెప్పుకోవచ్చు’ అని స్మిత్ అభిప్రాయ పడ్డాడు. పేసర్లపై నమ్మకం... భారత్‌కు రావడానికి ముందు ఆస్ట్రేలియా జట్టు దుబాయ్‌లో స్పిన్ పిచ్‌లపై సన్నద్ధమైంది. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనెసర్తో పాటు భారత మాజీ ఆల్‌రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్‌ను స్పిన్ కన్సల్టెంట్లుగా నియమించుకొని ప్రత్యేకంగా సాధన చేసింది. అయితే స్పిన్‌తో పాటు తమ పేస్ బౌలర్లు స్టార్క్, హాజల్‌వుడ్ కూడా ఈ పర్యటనలో కీలకం కానున్నారని స్మిత్ చెప్పాడు. ‘భారత గడ్డపై రివర్స్ స్వింగ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ విషయంలో స్టార్క్, హాజల్‌వుడ్‌లకు మంచి పట్టుంది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్‌ను వారు ఇబ్బంది పెట్టగలరు’ అని స్మిత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేసేందుకు తమ స్పిన్నర్లు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అతను వెల్లడించాడు. వారి జోరును ఆపుతాం... భారత టెస్టు విజయాల్లో కోహ్లి, అశ్విన్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆసీస్‌కు కూడా వారిద్దరినుంచే పెద్ద ముప్పు పొంచి ఉంది. అయితే ఆ ఇద్దరి కోసం తాము ప్రత్యేకంగా వ్యూహాలు రూపొందిస్తున్నామని స్మిత్ వెల్లడించాడు. ‘కోహ్లిలాంటి స్టార్ బ్యాట్స్‌మన్ కోసం మా వద్ద ప్రణాళిక ఉంది. దాని గురించి ఇప్పుడే చర్చించదల్చుకోలేదు. అశ్విన్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమని తెలుసు. అయితే అతనిపై ఎదురు దాడి చేసేందుకు మా బ్యాట్స్‌మెన్ అంతా సిద్ధమయ్యారు. ఈ ఇద్దరిని నిరోధించగలిగితేనే మా పని సులువవుతుంది’ అని స్మిత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. గత ఏడాది శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత కెప్టెన్‌గా తన ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చిందని... అందు వల్ల దూకుడుగా ఆడే తమ ఆటగాళ్ల సహజమైన బ్యాటింగ్ శైలిని మార్చే ప్రయత్నం చేయనని స్మిత్ అన్నాడు. ఆత్మరక్షణా ధోరణిలో ఆడటం మొదలు పెడితే మొదటికే మోసం వస్తుందని, కాబట్టి సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేస్తామని అతను చెప్పుకొచ్చాడు. అందుకు మేం రెడీ... భారత్, ఆస్ట్రేలియా సిరీస్ అంటే మాటల యుద్ధం జరగకుండా ఉండదు. ఈ సారి కూడా స్లెడ్జింగ్ వల్ల తమకు ‘మంచి’ జరుగుతుందని భావిస్తే తన ఆటగాళ్లను అడ్డుకోనని స్మిత్ పరోక్షంగా చెప్పాడు. ‘మైదానంలో ఒక్కో ఆటగాడు తనదైన తరహాలో ఆడతాడు. వారు మాటలతో ప్రత్యర్థిని కవ్వించాలని చూస్తే, దాని వల్ల వారిలోని అత్యుత్తమ ఆట బయటకు వస్తుందని భావిస్తే వారు దానిని కొనసాగించవచ్చు. చివర్లో మన ఆట వల్లే విజయవంతం అవుతామనే విషయం మరచిపోవద్దు’ అని స్మిత్ స్పష్టం చేశాడు. -
ఇదిగో... దీన్ని కూడా కాస్త సర్దుతావా!
భారత ఆటగాళ్లు ఎప్పుడైనా ఇలా సూట్‌కేసులు మోయడం చూశారా..! విమానాశ్రయమైనా, హోటల్ అయినా ఎలాంటి లగేజీ బాధ్యతలు లేకుండా వారంతా చెవులకు హెడ్‌ఫోన్‌తో దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయే దృశ్యాలే మన కళ్ల ముందు కదులుతాయి. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం భారత్‌లో దిగీ దిగగానే ఇలా సూట్‌కేసులు సర్దే పనిలోకి దిగిపోయారు. ఆటపరంగా అగ్రశ్రేణి జట్టు, వ్యక్తిగతంగా స్టార్ హోదా ఉన్నా సరే, వారంతా దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ‘శ్రమైక జీవన సౌందర్యం’ అంటూ కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్ ఇలా డీసీఎం వ్యాన్‌లోకి తమ బ్యాగేజీ తరలించడం చూసేవారందరికీ ఆశ్చర్యం కలిగించింది. ‘ఇదేమీ మాకు నామోషీగా అనిపించడం లేదు. ఇదంతా టీమ్ వర్క్లాంటిది. ఇంకా చెప్పాలంటే ఇలా మా అంతట మేం చేసుకుంటేనే పని తొందరగా అవుతుంది’ అని ఆస్ట్రేలియా జట్టు ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. మరో వైపు తాము కూలీలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూడా ఆసీస్ క్రికెటర్లు తామే లగేజీ ఎత్తేందుకు ఆసక్తి చూపించారని బీసీసీఐ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. వారు ఎంత సిద్ధమైనా అతిథిగా వచ్చిన జట్టును ఇలా వదిలేయడం మాత్రం ఏ రకంగా చూసినా అభిలషణీయం కాదు. ఆటతో, మాటతో కూడా మనకు బలమైన ప్రత్యర్థే అయినా... భేషజాలు లేని ఆస్ట్రేలియా ఆటగాళ్లను అభినందించకుండా ఉండలేం! -
కోహ్లిని తొందరగా
అవుట్ చేస్తేనే... మెల్బోర్న్: భారత్‌లో ఆస్ట్రే లియా జట్టు విజయావకాశా లను పెంచుకోవాలంటే స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లిని త్వరగా పెవిలియన్‌కు పంపడంపై దృష్టి పెట్టాలని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సూచించారు. కోహ్లిని రెచ్చగొట్టినట్టయితే మరింత దూకుడు పెంచుతాడని, ఇది కొన్నిసార్లు అతడికే కాకుండా ప్రత్యర్థికి కూడా లాభమేనని అన్నారు. వన్డేల్లో కోహ్లి బెస్ట్ బ్యాట్స్‌మన్ అని కితాబిచ్చిన పాంటింగ్... టెస్టుల్లో కోహ్లి నిరూపించుకోవాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. భారీ స్కోరుకు కష్టపడాల్సిందే: లీమన్ భారత పిచ్‌లపై తమ జట్టు భారీ స్కోరు చేయడం గట్టి సవాల్‌తో కూడుకుందని ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ అభిప్రాయపడ్డారు. గతంలో మాదిరి మాథ్యూ హేడెన్, డామియన్ మార్టిన్లా ఎవరో ఒకరు నిలదొక్కుకుని ఈ సమస్య తీరుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనెల 23 నుంచి ఆసీస్ తమ నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆరంభించనుంది. -
భారత్ పరాజయం
యాంట్‌వర్ప్ (బెల్జియం) : హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్ లీగ్ దశను భారత మహిళల జట్టు ఓటమితో ముగించింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందిన భారత జట్టు... ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో 2-4 తో ఓడింది. భారత్ తరఫున వందన, పూనమ్ రాణి ఒక్కో గోల్ సాధించగా... ఆస్ట్రేలియా జట్టుకు కెన్నీ జోడీ నాలుగు గోల్స్ అందించడం విశేషం. -
రేపట్నుంచే క్రికెట్ వార్!
-
రేపట్నుంచే క్రికెట్ వార్!
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 5.30 గంటలకు అడిలైడ్ నగరంలో తొలి టెస్టు మొదలువుతంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్ ఫిట్ అని తేలడంతో.. భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పగించారు. వృద్ధిమాన్ సాహా వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తాడు. గాయంతో భువనేశ్వర్ కుమార్ కూడా ఈ టెస్టుకు దూరంగా ఉన్నాడు. ఇశాంత్ శర్మ, వరుణ్ ఆరోన్, షమీ త్రయం పేస్ బౌలింగ్ దాడిని పంచుకుంటారు. ఇక ఆస్ట్రేలియా జట్టు మాత్రం బౌన్సర్లు సంధించే బౌలర్లతో ఈ మ్యాచ్ కోసం సన్నద్ధమైంది. సిడిల్, మిషెల్ జాన్సన్, హ్యారిస్ ఆస్ట్రేలియా జట్టులో ఉండనున్నారు. అలాగే షేన్ వాట్సన్, మిషెల్ మార్ష్ లాంటి ఆల్ రౌండర్లు కూడా ఆసీస్ జట్టుకోసం సిద్ధమయ్యారు. -
ఆసీస్ చేతిలో జింబాబ్వే చిత్తు
చెలరేగిన మ్యాక్స్‌వెల్, మార్ష్ హరారే: ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. ఇక్కడి హరారే స్పోర్ట్స్ క్లబ్లో సోమవారం ఏకపక్షంగా జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆసీస్ 198 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (46 బంతుల్లో 93; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), మిషెల్ మార్ష్ (83 బంతుల్లో 89; 7 ఫోర్లు, 4 సిక్సర్లు)ల విధ్వంసకర బ్యాటింగ్‌తో ముందుగా ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆరోన్ ఫించ్ (79 బంతుల్లో 67; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, బ్రాడ్ హాడిన్ (58 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మ్యాక్స్‌వెల్, మార్ష్ నాలుగో వికెట్‌కు 9 ఓవర్లలోనే 109 పరుగులు జోడించడం విశేషం. అనంతరం జింబాబ్వే 39.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. హామిల్టన్ మసకద్జా (91 బంతుల్లో 70; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్మిత్ 3 వికెట్లు పడగొట్టగా... స్టార్క్, లియోన్ చెరో 2 వికెట్లు తీశారు. మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు ఒక వికెట్ కూడా తీసిన మార్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. టోర్నీ తదుపరి మ్యాచ్‌లో బుధవారం ఇదే మైదానంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడతాయి.