రికార్డుల పరిశీలన వేగవంతం
Published Wed, Sep 7 2016 12:37 AM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM
మహబూబాబాద్ : మానుకోట జిల్లా ఏర్పా టు నేపథ్యంలో డివిజన్ పరిధిలోని పలు మండలాలు ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లా యి. దీంతో ఆయా మండలాల రికార్డుల పరిశీలన మానుకోట ఆర్డీఓ కార్యాలయం లో ముమ్మరం చేశారు. ఇందుకు సిబ్బంది ని కూడా కేటాయించారు. మానుకోట డివి జన్‌లో మానుకోట, డోర్నకల్ నియోజకవర్గాలతోపాటు తొర్రూరు, నెక్కొండ మండలాలు ఉన్నాయి. మానుకోట జిల్లాలోకి కొత్తగూడ, గూడూరు, బయ్యారం, గార్ల మండలాలు చేరాయి. నర్సంపేట డివిజన్‌లోని గూడూరు మండలం, ఖమ్మం జిల్లా కొత్తగూడ డివిజన్‌లోని గార్ల, బయ్యారం మండలాలు రానున్నాయి. మానుకోట డివి జన్ పరిధిలోని నెక్కొండ మండల రికార్డులను నర్సంపేట డివిజన్‌కు అందజేసే పను లు వేగవంతం చేశారు. నర్సంపేట డివిజన్‌లోని గూడూరు, ములుగు డివిజన్‌లోని కొత్తగూడ మండలానికి సంబంధించిన భూములు, ఇతర వివరాలను మానుకోట జిల్లా పరిధిలోకి రానున్నాయి. గార్ల, బయ్యారానికి సంబంధించి రికార్డులను త్వరలోనే ఆర్డీఓ కార్యాలయానికి వస్తాయని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement