డీఆర్వో కార్యాలయంలో పరిశీలిస్తున్న ఎన్నికల పరిశీలకుడు ధీరజ్ కుమార్
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ గ్రామీణ, అర్బన్ నియోజకవర్గాలకు నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకుడు ధీరజ్ కుమార్ గురువారం కలెక్టరేట్‌లోని ఎన్నికల కార్యాలయాలను పరిశీలించారు. ముందుగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వీవీప్యాట్లు, ఈవీఎంల అవగాహన కేంద్రాన్ని పరిశీలించారు. ఈవీఎంల ఉపయోగం, వీవీప్యాట్‌ల వినియోగంపై సిబ్బంది ని వివరాలు అడిగారు. అనంతరం ఎన్నికల మీడియా కేంద్రంలో పర్యటించి అభ్యర్థులు, పార్టీలు నిర్వహిస్తున్న ప్రచారం, ప్రకటనల రికార్డింగ్ లోకల్ కేబుల్ టీవీల్లో ఏ విధంగా రికార్డు చేస్తున్నారు? వాటిని ఏ విధంగా పరిశీలిస్తున్నారని ఆరా తీశారు. వార్త పత్రికల్లో ప్రచురణ అవుతున్న అనుమానిత చెల్లింపు వార్తలు, ప్రకటన క్లిప్పింగులను పరిశీలించారు. స్వీప్ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నిక ల ముఖ్య సమాచారమంతా మీడియా ద్వారానే తెలుస్తున్నందున, ప్రతి సమాచారాన్ని మీడియా ద్వారానే ప్రజలకు తెలియజేయాలన్నారు.
కలెక్టర్ రామ్మోహన్ రావు వివరిస్తూ ఎంసీసీ కమిటీ ఆధ్వర్యంలో ప్రవర్తన నియామావళి ఉల్లంఘన జరగకుండా ఎక్కడికక్కడ టీంల ద్వారా తనిఖీలు చేయిస్తున్నామన్నారు. స్థానిక సెలబ్రెటీల ద్వారా ఓటు హక్కు వినియోగంపై ప్రచారం చేస్తున్నామని, కేబుల్ టీవీల్లో ప్రసారమయ్యే ప్రకటనపై వీడి యో సర్వేలెన్స్ బృందాల ఆధ్వర్యంలో రోజువారి కార్యక్రమాలు పరిశీలించి ప్రకటనలపై రిటర్నింగ్ అధికారులతో అభ్యర్థులకు, పార్టీలకు నోటీసులు జారీకి ఆదేశాలిచ్చామన్నారు. పత్రికల్లో వచ్చే ప్రకటనలు, అనుమానిత చెల్లింపు వార్తపై ఏరోజుకారోజు ఆర్వోలకు వివరాలు పంపడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెక్‌పోస్టు వద్ద రవాణా, ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ అధికారులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి జిల్లాకు వచ్చే వాహనా లపై నిఘా పెట్టామని, అనుమానిత డబ్బు, మ ద్యాన్ని సీజ్ చేస్తున్నట్లు వివరించారు. ఎంసీసీ నోడల్ అధికారి సింహాచలం, డీఆర్వో అంజయ్య, సమాచార శాఖ డీడీ మహ్మద్ ముర్తుజా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment