ఎఫ్‌ఎంబీల డిజటలైజేషన్‌పై సంతృప్తి
ఎఫ్‌ఎంబీల డిజటలైజేషన్‌పై సంతృప్తి
Published Thu, Sep 15 2016 10:36 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
కర్నూలు(అగ్రికల్చర్): భూముల పీల్డ్ మెజర్‌మెంటు బుక్(ఎఫ్‌ఎంబీ)ల డిజిటలైజేషన్ ప్రక్రియపై ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ వైస్ చైర్మన్ కే.వెంకటరయణ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమం చురుగ్గా సాగుతోందన్నారు. కలెక్టరేట్ భూమి రికార్డులు, సర్వే విభాగంలో జరుగుతున్న ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. పలువురు డిజిటలైజర్లతో చర్చించి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమ వేగవంతానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. అన ంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ జిల్లా, అనంతపురం జిల్లా ముందంజలో ఉన్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఆలస్యంగా మొదలైనా సంతప్తికరంగా ఉందన్నారు. జిల్లాలో 4.80 లక్షల ఎప్‌ఎంబీలుండగా ఇప్పటి వరకు 62 వేల వరకు డిజిటలైజ్ చేసినట్లు వివరించారు. 2017 మార్చి చివరినాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్‌తో మ్యుటేషన్ చేయడం సులభమవుతుందని, దేశంలో ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో భూములను సబ్ డివిజన్ చేయవచ్చన్నారు. సర్వే డీడీ ఝాన్సీరాణి మాట్లాడుతూ 137 మంది డిజటలైజర్లతో కార్యక్రమాన్ని చేపడుతున్నారని, 30 మంది పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్వే ఏడీ చిన్నయ్య, ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ జిల్లా కో ఆర్డినేటర్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement