fmb
-
'సర్వే'జనా సుఖినోభవంతు
సాక్షి, గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): రామయ్యకు ఓ సర్వే నంబరులో వాస్తవానికి 0.50 ఎకరం భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో కేవలం 0.45 సెంట్లు మాత్రమే ఉన్నట్లు నమోదు చేశారు. వ్యత్యాసం సరిచేయాలని సర్వే కోసం(ఎఫ్–లైన్) దరఖాస్తు చేసుకున్నాడు. వాస్తవానికి రామయ్యకు భూమి ఉన్న సర్వే నంబరులో మొత్తం విస్తీర్ణం 10 ఎకరాలు. రామయ్యకు ఉన్న అర ఎకరా మాత్రమే సర్వే చేస్తే సరిపోదు. మొత్తం 10 ఎకరాల భూమిని సర్వే చేయాల్సి ఉంది. ఇతర రైతులు అంగీకరించకపోవడం, దీర్ఘకాలిక పంటలు వేయడంతో సర్వే నిలిచిపోయింది. వీరయ్యకు ఒక సర్వే నంబరులో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ సర్వే నంబరు నాలుగు సబ్ డివిజన్లు చేశారు. ఇందులో ఒక సర్వే సబ్ డివిజన్లో కొంత అసైన్డ్ భూమి ఉంది. తన కూతురు పెళ్లికోసం వీరయ్య భూమి అమ్మేశాడు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే సదరు సర్వే నంబరులో అసెన్డ్ భూమి ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. సర్వే చేయించి సర్టిఫికెట్ తేవాలని రిజిస్ట్రేషన్ అధికారులు చెప్పారు. వీరయ్య అవసరాన్ని గుర్తించిన సర్వేయర్లు, డబ్బులు ఇస్తేగానీ సర్వే చేయబోమని నిరాకరించారు. ఇవి ఏ ఒక్క గ్రామానికో పరిమితమైన çసమస్యలు కాదు. ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఇవే ప్రధాన సమస్యలు. 7 ఎకరాల భూమి, ఒకే సర్వే నంబరు, 15 మంది భూ యజమానులు. సర్వే సబ్ డివిజన్ జరగలేదు. సరిహద్దుల విషయంలో వారి మధ్య వివాదం. రైతులు పోలీస్ స్టేషన్, కోర్టులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు. ఇటువంటి వివాదాలను గ్రామాల్లో సాధారణంగా చూస్తుంటాం. భూముల సర్వే అసమగ్రంగా ఉండడం వల్ల రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి, వాస్తవ విస్తీర్ణానికి పొంతన లేని పరిస్థితి నెలకొంది దీంతో భూవివాదాలు నెలకొంటున్నాయి. వీటన్నిటికి చెక్ పెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భూముల సమగ్ర రీ సర్వే జరపాలని నిర్ణయించింది. వాస్తవానికి ప్రతి 30ఏళ్ల కోసారి భూములు రీ సర్వే చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో భూ వివాదాలు పెరిగిపోయాయి. 1954కు పూర్వం భూముల రీ సర్వే జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు భూముల రీ సర్వే ఊసే లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భూముల రీ సర్వే బిల్లును బడ్జెట్ సమావేశాల్లో పెట్టేందుకు కసరత్తు చేసింది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తరతరాల భూవివాదాలకు పరిష్కారం లభించినట్లేనని రైతులు భావిస్తున్నారు. రీసర్వే పూర్తి చేస్తే గ్రామాల్లో రైతుల మధ్య సమస్యలు సమసి పోతాయని, నిజమైన భూ యజమానులకు సర్వహక్కులు లభిస్తాయి. రీ సర్వే ప్రక్రియ సత్వరమే కార్యరూపం దాల్చాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దశాబ్దాల కిందట రీసర్వే.. ఎప్పుడో దశాబ్ధాల కిందట భూముల రీ సర్వే జరిగింది. అప్పట్లో తయారు చేసిన ఫీల్డ్ మెజర్ మెంట్ బుక్(ఎఫ్ఎంబీ) మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని చెదలు పట్టి పాడైపోగా, మరికొన్నింటిని భూ వివాదాల నేపథ్యంలో రెవెన్యూ సిబ్బందే ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో అసలు ఎఫ్ఎంబీ లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ఎఫ్ఎంబీ సక్రమంగా లేదు. వీరులపాడు మండలంలో జయంతి గ్రామంలో ఎఫ్‌ఎంబీని ఇక్కడ పనిచేసిన రెవెన్యూ సిబ్బంది సగానికి పైగా ధ్వంసం చేశారు. రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి, వాస్తవ విస్తీర్ణానికి పొంతన లేని పరిస్థితి. రైతుల మధ్య వివాదాలు వస్తే పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు వాటి గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఫలితంగా రైతులు కోర్టులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. మండలాల్లో భూమలు సర్వేకు సంబంధించిన ఎఫ్–లైన్ పిటిషన్లు చాలావరకు పెండింగ్‌లో ఉన్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలో ఈ ఏడాది ఎఫ్–లైన్ కోసం వచ్చిన దరఖాస్తులు - 1298 సర్వే సబ్ డివిజన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు -130 మంది దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తున్నాం రైతులు సర్వే కోసం ఆన్లైన్లో ఎఫ్–లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత నిర్ణీత గడువులో మండల సర్వేయర్ వాటిని పరిష్కరిస్తారు. రైతులనుంచి వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ఏవైనా వివాదాలు ఉంటే తప్ప అన్నింటిని వెంటనే పరిష్కరిస్తున్నాం. – కృష్ణప్రసాద్, డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వే -
ఎఫ్ఎంబీ చిత్రపటాలతో భూముల కంప్యూటరీకరణ
ఎన్ఆర్ఎస్ఏ డైరెక్టర్ కృష్ణమూర్తి రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : గ్రామీణ, వ్యవసాయ భూముల ఎఫ్ఎంబీ చిత్రపటాలను కంప్యూటరీకరించే కార్యక్రమం ఏపీ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఏపీఎస్ఏసీ) ద్వారా చేపడుతున్నారని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) డైరెక్టర్ డాక్టర్ వైవీఎన్‌వీ కృష్ణమూర్తి తెలిపారు. ఈ విలువైన సమాచారాన్ని డిజిటలైజేషన్ ద్వారా కంప్యూటర్లో నిక్షిప్తం చేసే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ‘డిస్సెమినేషన్ ఆఫ్ జియోస్పేషియల్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ’ అనే అంశంపై ఏపీఎస్ఏసీతో కలసి నన్నయ వర్సిటీ గురువారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధిలో భాగంగా ‘జియో స్పేషియల్ టెక్నాలజీ’ ప్రాముఖ్యతను, వినియోగాన్ని సరళతరంగా విద్యార్థులకు తెలియజేసేందుకు, ఆ దిశగా ఉద్యోగావకాశాలపై అవగాహన పొందడానికి దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో రిమోట్ సెన్సింగ్, జియోస్పేషియల్ వంటి అధునాతన సాధనాలను ఉపయోగించి, తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో నష్టాలను నివారించవచ్చన్నారు. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల విజ్ఞానాన్ని, టెక్నాలజీలో వస్తున్న ఆధునికతను జోడించి కొత్త విషయాలు కనుగొనవచ్చన్నారు. పరిశోధనలు, ఉద్యోగ రంగాలలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా యువతను తయారు చేయవచ్చన్నారు. ఏపీ అభివృద్ది కోసం అనేక రంగాలలో వినూత్న పథకాలను రూపొందించడంలో, వాటి కార్యాచరణ, అమలులో సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. అలాగే ఉపగ్రహ, సాంకేతిక విజ్ఞానాన్ని ఎక్కడెక్కడ ఏవిధంగా ఉపయోగించవచ్చునో ప్రజలకు, విద్యార్థులకు తెలియజేసేందుకు ఇటువంటి వర్క్‌షాపులు ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వనరులు వినియోగంలో ఏపీఎస్ఏసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభివృద్ధిని సాధించడంలో మన దేశానికి ఇస్రో, ఎన్ఆర్ఎస్ఏ వంటి జాతీయ సంస్థలు, ఏపీఎస్ఏసీ వంటి రాష్ట్ర స్థాయి సంస్థలు కీలకపాత్రను పోషిస్తున్నాయని నన్నయ రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు అన్నారు. ఏపీఎస్ఏసీ వైస్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నన్నయ వర్సిటీ డీన్ ఆచార్య ఎస్.టేకి, ప్రిన్సిపాల్ డాక్టర్ వై.శ్రీనివాసరావు, సహాయాచార్యులు డాక్టర్ కేవీ స్వామి, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్లో మరింత నాణ్యత
– సర్వేయర్లకు ప్రత్యేక సాప్ట్వేర్ – వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించిన సర్వే కమిషనర్ కర్నూలు(అగ్రికల్చర్): ఫీల్డ్ మెజర్మెంట్ బుక్(ఎఫ్ఎంబీ)ల డిజటలైజేషన్లో నాణ్యత పెంపుపై దృష్టి సారించాలని భూమి రికార్డులు, సర్వే శాఖ కమిషనర్ వాణిమోహన్ ఆదేశించారు. గురువారం హైద్రాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజిటౖలñ జేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఎప్‌ఎంబీల డిజిటలైజేషన్లో నాణ్యతకు ప్రత్యేక సాప్ట్వేర్ రూపొందించి సర్వేయర్లకు ఇచ్చామన్నారు. దీనిపై శిక్షణ ఇచ్చిన అనంతరం డిజిటల్‌గా మార్చిన ప్రతి ఎఫ్‌ఎంబీని క్షున్నంగా పరిశీలించి లోపాలుంటే సరిచేయాలన్నారు. ఇప్పటి వరకు డిజిటల్ చేసిన ఎప్‌ఎంబీలన్నిటిని శి„ý ణ పొందిన సర్వేయర్లు పరిశీలించాలన్నారు. కర్నూలు మండలం దేవమాడలో చేసిన భూములు రీ సర్వేను పూర్తి చేయాలన్నారు. రైతుల నుంచి ఉన్న అభ్యంతరాలను తక్షణం పరిష్కరించాలని సూచించారు. ఇందుకు స్థానిక తహశీల్దారు, వీఆర్ఓల సహకారం తీసుకోవాలన్నారు. కర్నూలు నుంచి సర్వే డీడీ ఝాన్సీరాణి మాట్లాడుతూ...ఇప్పటికే ఎఫ్‌ఎంబీల నాణ్యతను పెపొందించేందుకు ప్రత్యేకంగా టీములు వేసినట్లు తెలిపారు. సాప్ట్‌వేర్‌పై సర్వేయర్లకు వెంటనే శిక్షణ ఇస్తామని, ఆ తర్వాత డిజిటల్ చేసిన ఎఫ్‌ఎంబీలను పరిశీలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సర్వే ఏడీ చిన్నయ్య, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు -
ఎఫ్‌ఎంబీల డిజటలైజేషన్‌పై సంతృప్తి
కర్నూలు(అగ్రికల్చర్): భూముల పీల్డ్ మెజర్‌మెంటు బుక్(ఎఫ్ఎంబీ)ల డిజిటలైజేషన్ ప్రక్రియపై ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ వైస్ చైర్మన్ కే.వెంకటరయణ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమం చురుగ్గా సాగుతోందన్నారు. కలెక్టరేట్ భూమి రికార్డులు, సర్వే విభాగంలో జరుగుతున్న ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. పలువురు డిజిటలైజర్లతో చర్చించి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమ వేగవంతానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. అన ంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ జిల్లా, అనంతపురం జిల్లా ముందంజలో ఉన్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఆలస్యంగా మొదలైనా సంతప్తికరంగా ఉందన్నారు. జిల్లాలో 4.80 లక్షల ఎప్‌ఎంబీలుండగా ఇప్పటి వరకు 62 వేల వరకు డిజిటలైజ్ చేసినట్లు వివరించారు. 2017 మార్చి చివరినాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్‌తో మ్యుటేషన్ చేయడం సులభమవుతుందని, దేశంలో ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో భూములను సబ్ డివిజన్ చేయవచ్చన్నారు. సర్వే డీడీ ఝాన్సీరాణి మాట్లాడుతూ 137 మంది డిజటలైజర్లతో కార్యక్రమాన్ని చేపడుతున్నారని, 30 మంది పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్వే ఏడీ చిన్నయ్య, ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ జిల్లా కో ఆర్డినేటర్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో సర్వేయర్
రూ. 3 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం వెలుగోడు: సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలో మండల సర్వేయర్‌గా పనిచేస్తున్న నాగన్న ఏసీబీ వలలో చిక్కుకున్నారు. వెలుగోడు మండల కేంద్రానికి చెందిన రైతు గునిపాటి రామిరెడ్డి తన పొలాన్ని సర్వే చేయించడానికి గాను ఏడాదిన్నర క్రితం ప్రభుత్వానికి చలానా చెల్లించారు. గ్రామ పొలిమేరలోని సర్వే నెంబర్ 1075లో తన భూమి ఆక్రమణకు గురైందని.. కొలతలు వేసి భూమి చూపాలని అప్పటి నుంచి ఆయన సర్వేయర్‌ను కలిసి విన్నవించుకుంటున్నారు. అయితే రూ.3 వేలు ఇస్తే కొలతల వివరాలు చూపే ఎఫ్ఎంబీ ఇస్తానని సర్వేయర్ డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేనని రైతు పలుమార్లు చెప్పినా సర్వేయర్ వినలేదు. వ్యవసాయంలో తీవ్ర కష్టనష్టాలను ఎదుర్కొన్న ఆయన చివరికి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ మహబూబ్‌బాషా సోమవారం సర్వేయర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు వల పన్నారు. రూ.3 వేలను రామిరెడ్డి ద్వారా నాగన్నకు పంపారు. తహశీల్దార్ కార్యాలయంలోని సర్వేయర్ బయటకు వచ్చి రైతు నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ మేరకు సర్వేయర్‌పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహబూబ్‌బాషా మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు లంచం తీసుకుంటే జైలుకు వెళ్లక తప్పదన్నారు. అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. లంచావతారుల సమాచారాన్ని డీఎస్పీ సెల్ నెం.9440446178, సీఐలకు 9440446129, 9490611022, 9490611024 నెంబర్లలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. వివరాలు అందజేసిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామన్నారు. దాడుల్లో సీఐలు కృష్ణారెడ్డి, సీతారామశాస్త్రి్త, ప్రసాదరావు సిబ్బంది పాల్గొన్నారు.