ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్‌లో మరింత నాణ్యత
ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్‌లో మరింత నాణ్యత
Published Thu, Sep 22 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
– సర్వేయర్లకు ప్రత్యేక సాప్ట్‌వేర్
– వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించిన సర్వే కమిషనర్
కర్నూలు(అగ్రికల్చర్): ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్(ఎఫ్‌ఎంబీ)ల డిజటలైజేషన్‌లో నాణ్యత పెంపుపై దృష్టి సారించాలని భూమి రికార్డులు, సర్వే శాఖ కమిషనర్ వాణిమోహన్ ఆదేశించారు. గురువారం హైద్రాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజిటౖలñ జేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఎప్‌ఎంబీల డిజిటలైజేషన్‌లో నాణ్యతకు ప్రత్యేక సాప్ట్‌వేర్ రూపొందించి సర్వేయర్లకు ఇచ్చామన్నారు. దీనిపై శిక్షణ ఇచ్చిన అనంతరం డిజిటల్‌గా మార్చిన ప్రతి ఎఫ్‌ఎంబీని క్షున్నంగా పరిశీలించి లోపాలుంటే సరిచేయాలన్నారు. ఇప్పటి వరకు డిజిటల్ చేసిన ఎప్‌ఎంబీలన్నిటిని శి„ý ణ పొందిన సర్వేయర్లు పరిశీలించాలన్నారు. కర్నూలు మండలం దేవమాడలో చేసిన భూములు రీ సర్వేను పూర్తి చేయాలన్నారు. రైతుల నుంచి ఉన్న అభ్యంతరాలను తక్షణం పరిష్కరించాలని సూచించారు. ఇందుకు స్థానిక తహశీల్దారు, వీఆర్‌ఓల సహకారం తీసుకోవాలన్నారు. కర్నూలు నుంచి సర్వే డీడీ ఝాన్సీరాణి మాట్లాడుతూ...ఇప్పటికే ఎఫ్‌ఎంబీల నాణ్యతను పెపొందించేందుకు ప్రత్యేకంగా టీములు వేసినట్లు తెలిపారు. సాప్ట్‌వేర్‌పై సర్వేయర్లకు వెంటనే శిక్షణ ఇస్తామని, ఆ తర్వాత డిజిటల్ చేసిన ఎఫ్‌ఎంబీలను పరిశీలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సర్వే ఏడీ చిన్నయ్య, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు
Advertisement
Advertisement