స్పెయిన్-ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 26) జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యంత చెత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు ఐజిల్ ఆఫ్ మ్యాన్ 8.4 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఐజిల్ ఆఫ్ మ్యాన్ ఇన్నింగ్స్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయకపోగా.. ఏకంగా 6 మంది డకౌట్ అయ్యారు.
ఐజిల్ ఆఫ్ మ్యాన్ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా నమోదు కాకపోగా.. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 4గా ఉంది. జోసఫ్ బుర్రోస్ 4 పరుగులు చేయగా.. జార్జ్ బుర్రోస్, లూక్ వార్డ్, జాకబ్ బట్లర్ తలో 2 పరుగులు చేశారు. ఐజిల్ ఆఫ్ మ్యాన్ ఆటతీరు ఎంత చెత్తగా సాగిందో ఈ గణంకాలు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. స్పెయిన్ బౌలర్లలో మహ్మద్ కమ్రాన్ (4-1-4-4), అతీఫ్ మెహమూద్ (4-2-6-4) తలో 4 వికెట్లు పడగొట్టగా, లోర్న్ బర్న్స్ (0.4-0-0-2) 2 వికెట్లు దక్కించుకున్నాడు.
అనంతరం 11 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్పెయిన్.. కేవలం 2 బంతుల్లోనే ఆటను ముగించింది. తొలి బంతిని జోసఫ్ బుర్రోస్ నో బాల్ వేయగా.. ఆ తర్వాత రెండు బంతులను అవైస్ అహ్మద్ సిక్సర్లుగా మలిచి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ పలు చెత్త రికార్డులకు వేదికైంది. పురుషుల అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్ (10 ఆలౌట్), ఛేదనలో ఫాస్టెస్ట్ రన్‌రేట్ (39), బంతుల తేడా పరంగా విజయం (118 బంతులు) లాంటి చెత్త రికార్డులు ఈ మ్యాచ్‌లో నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment