అన్నదమ్ముల అరుదైన ఘనత
మూడేళ్లకే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
నాలుగున్నరేళ్లకే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్
వంద దేశాలు, రాజధానులు, కరెన్సీ పేర్లు టకటకా చెప్పేస్తారు
ప్రఖ్యాత ప్రదేశాలు, ప్రముఖ వ్యక్తుల పేర్లు, జీకే ప్రశ్నలకు కూడా..
అద్భుతమైన జ్ఞాపక శక్తి ఆ ఇద్దరి అన్నదమ్ముల సొంతం. ఒక్కసారి చదివినా, చెప్పింది విన్నా ఇట్టే గుర్తుంటుంది. ఏడాదిన్నర వయసులోనే విషయం గ్రహించిన తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు. సాధారణంగా భారతదేశం రా్రష్టాలు, రాజధానులు, చిత్రపటంలో గుర్తించడం వంటివి చెప్పారు. అవి ధారాళంగా పలకడం, గుర్తుంచుకుని చెప్పడం చూసిన తల్లిదండ్రులు ప్రపంచపటం వైపు అడుగులు వేశారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం...
వంద దేశాలను లక్ష్యంగా చేసుకుని దేశాలు, రాజధానులు, కరెన్సీల పేర్లను ప్రాక్టీస్ చేయించారు. ఆ బుడతలకు మూడేళ్లకే వంద దేశాల సమాచారం నాలుకమీద నడయాడుతుంది. అసాధారణ ప్రతిభను చూసిన తల్లిదండ్రులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులను సంప్రదించారు. ఇంకేముంది పిల్లల తెలివితేటలను గుర్తించిన ఆయా సంస్థల ప్రతినిధులు రికార్డుల్లో స్థానం కలి్పంచారు. అయితే ఇంత సమాచారాన్ని గుక్కతిప్పుకోకుండా చెప్పడం అందరికీ సాధ్యం కాదనే చెప్పాలి. భాగ్యనగరానికి చెందిన బుడుమూరు గౌతం నంది మాత్రం నాలుగున్నరేళ్లకే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.
3.59 నిమిషాల్లో..
దేశాలు, రాజధానులు, భారత దేశంలోని రాష్ట్రాలు, రాజధానులు, 25 జంతువుల పేర్లు, 30 మంది చారిత్రక వ్యక్తుల పేర్లు, 12 జనరల్ నాలెడ్జ్ వంటి ప్రశ్నలకు సమాధానాలు కేవలం 3.59 నిమిషాల్లో టకటకా చెప్పేశాడు. ఇంకేముంది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. దీంతో పాటు పాటలు పాడటం, రామాయణం, భగవద్గీత, కొన్ని ఆధ్యాతి్మక శ్లోకాలు ఇట్టే చెప్పేస్తున్నాడు. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నాడు. దీంతో పాఠశాల స్థాయిలో వివిధ రకాల పోటీల్లో చురుగ్గా పాల్గొనడం అలవాటుగా మార్చుకున్నాడు. యాజమాన్యాలు సైతం గౌతం ప్రతిభను గుర్తించి ఎక్కడ ప్రతిభ పోటీలు నిర్వహించినా తమ పాఠశాల నుంచి పాల్గొనేందుకు అవకాశం కలి్పస్తున్నాయి. ప్రస్తుతం మూడో తరగతికి వెళుతున్న గౌతం నంది తల్లిదండ్రుల ప్రోత్సాహం, యూ ట్యూబ్ సాయంతో సెల్ఫ్ లెరి్నంగ్ స్కిల్స్‌లో దూసుకుపోతున్నాడు.
అన్న బాటలో తమ్ముడు...
అన్న గౌతం నంది అలవాట్లు, తెలివితేటలు తమ్ముడు కౌస్తవ్ నందికి కూడా అబ్బాయి. మూడేళ్ల వయసులోనే 50 మంది ఆవిష్కర్తల పేర్లు, భారత రాష్ట్రాలు, 10 శ్లోకాలు, 6 ఇంగ్లి‹Ù, 5 తెలుగు నర్సరీ రిథమ్స్, 50 రకాల పండ్లు, 50 జంతువులు, 30 మంది చారిత్రక వ్యక్తుల పేర్లు, 20 జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన బుడుమూరు కౌస్తవ్ నంది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. ఈ పిల్లాడు ఇంకా పాఠశాలలో చేరకపోవడం విశేషం.
తల్లిదండ్రులు శ్రద్ధవహించాలి..
గౌతం నంది తెలివితేటలను ఏడాదిన్నర వయసులోనే గుర్తించాం. అందుకే ఎక్కువ సమయం కేటాయించేవాళ్లం. చెప్పేకొద్దీ తెలివితేటలు ఆశ్యర్యం కలిగించేవి. దీంతో తల్లి కల్పన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఈ క్రమంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులను సంప్రదించాం. వారు గౌతం ప్రతిభకు గుర్తించారు. మరో ఏడాది తరువాత ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. కౌస్తవ్ సైతం అదే బాటలో వెళుతున్నాడు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు సాధించొచ్చని నమ్ముతా.
– వెంకట అప్పలనాయుడు, విద్యార్థి తండ్రి
Comments
Please login to add a commentAdd a comment