రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజేషన్
Published Thu, Feb 9 2017 1:22 AM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
ఏలూరు (మెట్రో) : రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లోనే అవసరమైన ధ్రువీకరణ పత్రా లు అందించే నూతన విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని సీసీఎల్‌ఏ అనిల్ చంద్ర పునీత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం మధ్యాహ్నం జిల్లా జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మా ట్లాడారు. ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు రెవెన్యూ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందు పరచామని, ప్రజలు ఏ ధ్రువీకరణ పత్రం కావాలన్నా క్షణాల్లో పొందే వెసులుబాటు కల్పించామని, ఈ మేరకు ప్రజలకు అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేశామని, ఈ నేపథ్యంలో రైతులకు కావాల్సిన ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో పొందే అవకాశాన్ని కల్పించామన్నారు. డీఆర్వో హైమావతి, సూపరింటెండెంట్లు దొర, సూర్యనారాయణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement