తెలంగాణ ప్రభుత్వం జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, మండలాలను పునర్విభజన చేపట్టినందున రెవెన్యూ రికార్డులను భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని వీఆర్‌ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి కోరారు.
మఠంపల్లి : తెలంగాణ ప్రభుత్వం జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, మండలాలను పునర్విభజన చేపట్టినందున రెవెన్యూ రికార్డులను భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని వీఆర్‌ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని బక్కమంతులగూడెంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాల పునర్విభజనను స్వాగతిస్తున్నామని.. అదే సందర్భంలో ప్రభుత్వం వీఆర్‌వోలకు పాత సర్వీస్ నిబంధలు పరిగణనలోకి తీసు కోవాలన్నారు. అలాగే మీ సేవా కేంద్రాల్లో ఇస్తున్న పాస్ పుస్తకాలను అమల్లోకి తీసుకోవాలని కోరారు. రెవెన్యూ రికార్డులను భద్రపరచాలని రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోలకు సూచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అ«ధ్యక్ష, కార్యదర్శులు కొప్పోలు సుధాకర్‌రావు, ఠాకూర్‌సింగ్, మండల అధ్యక్షులు నారపు రాజు రామారావు, వీరారెడ్డి, వాసుదేవరావు తదితరులున్నారు.