23, 24 తేదీల్లో టెలీ కాన్ఫరెన్స్
అనంతపురం ఎడ్యుకేషన్ : త్రీఆర్స్ సర్వే ఫలితాలలు, విశ్లేషణ, 100 రోజుల రెమెడియేషన్ కార్యక్రమ ప్రణాళిక, సబ్జెక్ట్ వారీగా రెమెడియేషన్ కార్యక్రమంపై రాష్ట్ర అధికారులు...ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ఏఎంఓ, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఈ నెల 23, 24 తేదీల్లో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.
23న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు బోధించే ఉపాధ్యాయుల్లో సగం మంది హాజరుకావాలని డీఈఓ సూచించారు. 24న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 1 నుంచి 5 తరగతులు బోధించే ఉపాధ్యాయుల్లో మిగతా సగం మంది పాల్గొనాలని కోరారు. 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెమెడియల్ టీచింగ్ కార్యక్రమ అమలుపై జిల్లా అధికారులు, సబ్జెక్టు ఉపాధ్యాయులతో 27న టెలీ కాన్ఫరెన్స్ ఉంటుందని పేర్కొన్నారు.