సాక్షి, బెంగళూర్ : చిన్న స్వామి స్టేడియంలో భారత్ అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన చారిత్రక టెస్టు మ్యాచ్ రికార్డుల సునామీ సృష్టించింది. ఐదు రోజుల మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. దీంతో టీమిండియా రెండ్రోజుల్లోనే మ్యాచ్ ముగించటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అఫ్గాన్‌పై భారత్ ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు టీమిండియాకు ఇన్నింగ్స్ విజయం పరంగా ఇదే అతి పెద్దది. 2007లో బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో విజయం సాధించింది, ఇదే ఇప్పటివరకు అత్యుత్తమం. ఇక అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అతి తక్కువ ఓవర్లలో ఆలౌటై చెత్త రికార్డును అఫ్గానిస్తాన్ మూటగట్టుకుంది. తొలి రెండు స్థానాల్లో (తొలి ఇన్నింగ్స్‌లో 27.5 ఓవర్లలో, రెండో ఇన్నింగ్స్‌లో 38.4 ఓవర్లలో ఆలౌటైంది) అఫ్గానే ఉండటం గమనార్హం. ఇంకా పలు రికార్డులను పరిశీలిస్తే
- అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోని ఒక ఇన్నింగ్స్‌లో అతి తక్కువ పరుగులకు(103) ఆలౌటైన మూడో జట్టుగా అప్గాన్ అపప్రదను మూటగట్టుకుంది. తొలి రెండు స్ధానాలలో (దక్షిణాఫ్రికా (84 రన్స్), బంగ్లాదేశ్ (91 రన్స్)) ఉన్నాయి.
- టీమిండియా గెలిచిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో ప్రత్యర్థి జట్టును అతి తక్కువ పరుగులకు కట్టడి చేసిన మ్యాచ్ ఇదే. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అఫ్గాన్ 212 పరుగులు మాత్రమే చేసింది. 1986లో టీమిండియాపై ఇంగ్లండ్ 230 పరుగుల చేసింది, ఇదే ఇప్పటివరకు అత్యుత్తమం.
- టెస్టు మ్యాచ్‌లో ఒకే రోజులో అత్యధిక వికెట్లు(24) పడిన మ్యాచ్‌లో ఇది నాల్గోది, 1888లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు ఒకే రోజు 27 వికెట్లు సాధించారు.
- టీమిండియా గెలిచిన టెస్టు మ్యాచ్‌లో(రెండు ఇన్నింగ్స్‌లు కలిపి) అతి తక్కువ బంతులు బౌలింగ్ చేసిన మ్యాచ్ ఇదే. 399 బంతులు మాత్రమే బౌలింగ్ చేసింది. 2014లో ఆస్ట్రేలియాపై 554 బంతులు వేసిన మ్యాచే ఇప్పటివరకు అత్యుత్తమం.
Comments
Please login to add a commentAdd a comment