ఏదైనా ఒక వస్తువును పోగొట్టుకున్న తరువాత.. దాని విలువ హఠాత్తుగా పెరిగితే, దాని కోసం ఎక్కడపడితే అక్కడ వెతికేస్తాం. అంతెందుకు జేబులో ఉన్న ఓ వంద రూపాయలు ఎక్కడైనా పడిపోతేనే మనం ఎక్కడెక్కడ తిరిగామో.. అక్కడంతా వెతికేస్తాం. అయితే ఓ వ్యక్తి వేలకోట్ల విలువ గలిగిన బిట్‌కాయిన్‌లు ఉన్న హార్డ్ డ్రైవ్ పోగొట్టుకున్నాడు. దాన్ని వెదకడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేశారో.. ఈ కథనంలో చూసేద్దాం.
జేమ్స్ హోవెల్స్ అనే వ్యక్తి 2013లో అనుకోకుండా.. 7500 బిట్‌కాయిన్‌లు ఉన్న ఒక హార్డ్ డ్రైవ్ పోగొట్టుకున్నాడు. అయితే దాని విలువ ఇప్పుడు 771 మిలియన్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 65 వేలకోట్ల కంటే ఎక్కువ.
తన హార్డ్ డ్రైవ్ స్థానిక స్థానిక ల్యాండ్‌ఫిల్ (డంప్‌యార్డ్) ప్రాంతంలో ఉంటుందని, డ్రైవ్ కోసం త్రవ్వడానికి అనుమతించమని న్యూపోర్ట్, వేల్స్ కౌన్సిల్‌ని ఒప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. అనుమతిస్తే.. బిట్‌కాయిన్‌లో 10% లేదా దాదాపు 77 మిలియన్లను స్థానిక కమ్యూనిటీకి విరాళంగా ఇస్తానని పేర్కొన్నాడు.
హార్డ్ డ్రైవ్‌ను వెదకడానికి హోవెల్స్ తన ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టాడు. మొత్తం సమయాన్ని కేవలం ఆ డ్రైవ్‌ను వెదకడానికే కేటాయించాడు. దీనిని వెదకడంలో అతనికి సహాయం చేయడానికి నిపుణుల బృందాన్ని కూడా నియమించుకున్నాడు. అంతటితో ఆగకుండా.. హోవెల్స్ ల్యాండ్‌ఫిల్‌ను శోధించే హక్కు కోసం నగరంపై దావా వేసి 629 మిలియన్ల నష్టపరిహారం కోరాడు.
హోవెల్స్ కేసు ఇటీవల న్యాయమూర్తి ముందుకు వచ్చింది. హైకోర్టులో పూర్తిస్థాయి విచారణకు రాకముందే కేసును కొట్టివేయాలని న్యూపోర్ట్ అథారిటీ ప్రయత్నిస్తోంది. ల్యాండ్‌ఫిల్‌లోకి వెళ్ళేదంతా కౌన్సిల్ యాజమాన్యంలోకి వస్తుందని చెప్పారు. తవ్వకానికి అనుమతి ఇస్తే సంఘానికి డబ్బు అందజేస్తామని ఇచ్చిన ప్రతిపాదనను.. కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జేమ్స్ గౌడ్ కేసీ.. లంచం అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వేల సంవత్సరాలు పనిచేసే డైమండ్ బ్యాటరీ ఇదే..
హోవెల్స్ అభ్యర్థన మేరకు ల్యాండ్‌ఫిల్ తవ్వకాలు జరిపితే.. పర్యావరణానికి ప్రమాదం అని అన్నారు. అంతే కాకుండా తవ్వకాలకు అనుమతిస్తే, పది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం చెత్తలో ఉన్న హార్డ్ డ్రైవ్‌లో డేటా ఉంటుందా? అనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. ఎవరెన్ని చెప్పినా హోవెల్స్ మాత్రం హార్డ్ డ్రైవ్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment