Hard drive
-
హార్డ్ డ్రైవ్‌లో రూ.65 వేలకోట్లు!.. పదేళ్లుగా వెతుకులాట
ఏదైనా ఒక వస్తువును పోగొట్టుకున్న తరువాత.. దాని విలువ హఠాత్తుగా పెరిగితే, దాని కోసం ఎక్కడపడితే అక్కడ వెతికేస్తాం. అంతెందుకు జేబులో ఉన్న ఓ వంద రూపాయలు ఎక్కడైనా పడిపోతేనే మనం ఎక్కడెక్కడ తిరిగామో.. అక్కడంతా వెతికేస్తాం. అయితే ఓ వ్యక్తి వేలకోట్ల విలువ గలిగిన బిట్కాయిన్లు ఉన్న హార్డ్ డ్రైవ్ పోగొట్టుకున్నాడు. దాన్ని వెదకడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేశారో.. ఈ కథనంలో చూసేద్దాం.జేమ్స్ హోవెల్స్ అనే వ్యక్తి 2013లో అనుకోకుండా.. 7500 బిట్కాయిన్లు ఉన్న ఒక హార్డ్ డ్రైవ్ పోగొట్టుకున్నాడు. అయితే దాని విలువ ఇప్పుడు 771 మిలియన్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 65 వేలకోట్ల కంటే ఎక్కువ.తన హార్డ్ డ్రైవ్ స్థానిక స్థానిక ల్యాండ్‌ఫిల్ (డంప్‌యార్డ్) ప్రాంతంలో ఉంటుందని, డ్రైవ్ కోసం త్రవ్వడానికి అనుమతించమని న్యూపోర్ట్, వేల్స్ కౌన్సిల్‌ని ఒప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. అనుమతిస్తే.. బిట్‌కాయిన్‌లో 10% లేదా దాదాపు 77 మిలియన్లను స్థానిక కమ్యూనిటీకి విరాళంగా ఇస్తానని పేర్కొన్నాడు.హార్డ్ డ్రైవ్‌ను వెదకడానికి హోవెల్స్ తన ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టాడు. మొత్తం సమయాన్ని కేవలం ఆ డ్రైవ్‌ను వెదకడానికే కేటాయించాడు. దీనిని వెదకడంలో అతనికి సహాయం చేయడానికి నిపుణుల బృందాన్ని కూడా నియమించుకున్నాడు. అంతటితో ఆగకుండా.. హోవెల్స్ ల్యాండ్‌ఫిల్‌ను శోధించే హక్కు కోసం నగరంపై దావా వేసి 629 మిలియన్ల నష్టపరిహారం కోరాడు.హోవెల్స్ కేసు ఇటీవల న్యాయమూర్తి ముందుకు వచ్చింది. హైకోర్టులో పూర్తిస్థాయి విచారణకు రాకముందే కేసును కొట్టివేయాలని న్యూపోర్ట్ అథారిటీ ప్రయత్నిస్తోంది. ల్యాండ్‌ఫిల్‌లోకి వెళ్ళేదంతా కౌన్సిల్ యాజమాన్యంలోకి వస్తుందని చెప్పారు. తవ్వకానికి అనుమతి ఇస్తే సంఘానికి డబ్బు అందజేస్తామని ఇచ్చిన ప్రతిపాదనను.. కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జేమ్స్ గౌడ్ కేసీ.. లంచం అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వేల సంవత్సరాలు పనిచేసే డైమండ్ బ్యాటరీ ఇదే..హోవెల్స్ అభ్యర్థన మేరకు ల్యాండ్‌ఫిల్ తవ్వకాలు జరిపితే.. పర్యావరణానికి ప్రమాదం అని అన్నారు. అంతే కాకుండా తవ్వకాలకు అనుమతిస్తే, పది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం చెత్తలో ఉన్న హార్డ్ డ్రైవ్‌లో డేటా ఉంటుందా? అనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. ఎవరెన్ని చెప్పినా హోవెల్స్ మాత్రం హార్డ్ డ్రైవ్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు. -
రూ.5,900 కోట్ల విలువైన బిట్కాయిన్లు చెత్తకుప్ప పాలు!
లండన్: అనగనగా ఒక పాత హార్డ్‌డ్రైవ్. బ్రిటన్‌కు చెందిన 39 ఏళ్ల జేమ్స్ హావెల్స్ అనే వ్యక్తి క్రిప్టోకరెన్సీ తొలినాళ్లలో అంటే 2009 ఏడాదిలో 8,000 బిట్కాయిన్లను మైనింగ్ చేశాడు. వాటికి సంబంధించిన డిజిటల్ కీని ఆ పాత హార్డ్‌డ్రైవ్‌లో దాచి ఉంచాడు. అయితే అది తర్వాత కనిపించకుండా పోయింది. తన ప్రియురాలు హఫీనా ఎడీ ఎవాన్స్‌తో కలిసి ఈ హార్డ్‌డ్రైవ్ కోసం వేట మొదలెట్టాడు. అది కనిపించట్లేదని ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అది 2013 ఏడాదిదాకా ఇంట్లోనే ఒక గదిలో సొరుగులో ఉండిపోయింది. అయితే 2013లో ఇంటిని ప్రియురాలు హఫీనా శుభ్రంచేస్తుండగా పాత కంప్యూటర్ విడిభాగాలున్న ఒక పాత నల్ల సంచి కనిపించింది. దీనిని పడేయాలా? అని జేమ్స్‌ను హఫీనా అడగ్గా అవసరం లేదు పడేసెయ్ అని చెప్పాడు. దీంతో బయటికెళ్తూ దారిలో ఉన్న చెత్తకుప్పలో దానిని పడేసి వెళ్లిపోయింది. తర్వాత ఇద్దరూ దాని కోసం వేట కొనసాగించారు. అయితే తాజా దర్యాప్తులో.. ఆమె గతంలో పడేసిన సంచిలోనే హార్డ్‌వేర్ ఉందని తాజాగా వెల్లడైంది. హార్డ్‌వేర్‌లోని డిజిటల్ కీ సాయంతో అందుబాటులోకి వచ్చే 8,000 బిట్కాయిన్ల ప్రస్తుత మార్కెట్ విలువ ఏకంగా రూ.5,900 కోట్లు కావడం గమనార్హం. విషయం తెల్సి హఫీనా హుతాశురాలైంది. ప్రస్తుతం వీళ్లిద్దరూ విడిపోయారు. ‘‘జేమ్స్ సంపదను తెలీకుండా చెత్తపాలు చేశాను. దాని కోసం అతను పడుతున్న వేదనను చూడలేకపోతున్నా’’అని తాజాగా హఫీనా వాపోయారు. హఫీనా పడేసిన చెత్తకుప్పలోని వ్యర్థ్యాలు సాధారణంగా వేల్స్‌లోని న్యూపోర్ట్‌లో ఉన్న డాక్స్వే భారీ డంపింగ్ యార్డ్‌కు చేరుకుంటాయి. అక్కడ ఏకంగా 14,00,000 టన్నుల చెత్తకుప్ప కొండ ఉంది. అందులో ఎలాగైనా తన హార్డ్‌డ్రైవ్‌ను తిరిగి సంపాదిస్తానని జేమ్స్ బయల్దేరారు. అయితే అంత చెత్తను కింది నుంచి మొత్తం తిరగతోడితే కాలుష్యం పెరిగి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలు వస్తాయని న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ ససేమిరా అంటోంది. యార్డ్‌లోకి అతనికి అనుమతి నిరాకరించింది. దీంతో జేమ్స్ కోర్టును ఆశ్రయించాడు. మొత్తం గాలించి హార్డ్‌డ్రైవ్ దొరికితే కుబేరుడినయ్యాక సంపదలో 10 శాతాన్ని న్యూపోర్ట్ అభివృద్ధికి కేటాయిస్తానని, నగరాన్ని దుబాయ్, లాస్ వెగాస్ సిటీలా తీర్చిదిద్దుతానని కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ అంశాన్ని డిసెంబర్లో విచారిస్తామంటూ ఈ కేసును కోర్టు వాయిదావేసింది. -
చెరిపేయండి... శాశ్వతంగా!
పీసీలోంచి ఫైళ్లు తొలగించాలంటే మీరు ఏం చేస్తారు? ఆ... ఏముంది.. ట్రాష్‌లో పడేస్తేసరి అంటున్నారా? బాగానే ఉంటుంది కానీ దీనిద్వారా ఫైల్ పూర్తిగా తొలగిపోదు!! హార్డ్డ్రై వ్‌లో ఎక్కడో ఓ మూలన అలాగే పడి ఉంటుంది. కాలం గడిచేకొద్దీ ఇలాంటి చెత్త అంతా పేరుకుపోయి... పీసీ నత్తనడకన నడవడం మొదలవుతుంది. ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎంచక్కా ఈ పద్ధతులు పాటించండి! ట్రాష్‌లో పడేసి, క్లీన్ చేసిన ప్రతిసారి హమ్మయ్యా.. కొంత చెత్త వదిలించుకున్నామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మన పని సగమే అయినట్లు లెక్క. ఎందుకంటే ట్రాష్‌ను క్లీన్ చేసినప్పుడు ఫైల్ తాలూకూ వర్చువల్ పాథ్ మాత్రమే డిలీట్ అవుతుంది. ఫైల్ అలాగే స్టోర్ అవుతుంది. కొంచెం కష్టమైనప్పటికీ వీటిని మళ్లీ రికవర్ చేసే అవకాశం ఉంటుంది. మామూలు ఫైళ్ల విషయంలో ఫర్వాలేదేమోగానీ.... సున్నితమైన వివరాలున్న ఫైళ్ల విషయంలో మాత్రం మరింత జాగ్రత్త అవసరం. ఈ సమస్యను అధిగమించేందుకు అదే ఫైల్‌పై మళ్లీ సమాచారాన్ని స్టోర్ చేయడం ఒక్కటే మార్గం. కానీ ఇది చేతులతో చేసే పని కాదు. మార్కెట్లో ఉచితంగా లభించే సాఫ్ట్వేర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. అలాంటివి ఏమేమి ఉన్నాయో, అవెలా పనిచేస్తాయో చూడండి... ఇరేజర్... ఈ సాఫ్ట్వేర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే కంప్యూటర్ల కోసం మాత్రమే. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తరువాత డిలీట్ చేయాల్సిన ఫైల్‌పై రైట్ క్లిక్ చేస్తే చాలు... కనిపించే ఆప్షన్లలో ఇరేజర్ ఐకాన్‌ను ఎంచుకోవడం ద్వారా ఫైల్‌ను శాశ్వతంగా చెరిపేయవచ్చు. ఒక్కో ఫైల్‌ను ఎన్నిసార్లు ఓవర్‌రైట్ చేయవచ్చో మీరే నిర్ణయించుకోవచ్చు. అంతేకాకుండా ట్రాష్‌లో పడేసే ప్రతిఫైల్‌ను ఇలా ఓవర్‌రైట్ చేసి డిలీట్ చేసేలా ఇరేజర్ను ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సీసీ క్లీనర్... దీని గురించి మీరు వినే ఉంటారు. హార్డ్‌డిస్క్‌లో స్పేస్‌ను ఆదా చేసేందుకు తరచూ వాడే సాఫ్ట్వేర్ ఇది. సాధారణ పద్ధతుల్లో ఫైళ్లను డిలీట్ చేసిన తరువాత వాటిని గుర్తులను చెరిపేసేందుకు చక్కగా ఉపయోగపడుతుంది ఈ సాఫ్ట్వేర్. పీసీలో నిర్దిష్టంగా ఫలానా ప్రాంతాల్లోని అనవసరమైన ఫైళ్లను ఓవర్‌రైట్ చేయమని సూచించే అవకాశం ఉంటుంది సీసీక్లీనర్ సాఫ్ట్‌వేర్‌తో. దీంట్లోనూ ఎన్నిసార్లు ఓవర్‌రైట్ చేయాలన్నది మనమే నిర్ణయించుకోవచ్చు. సోర్స్ ఎమ్టీ ట్రాష్.. ఈ సాఫ్ట్వేర్ ఆపిల్ కంప్యూటర్ల కోసం ఉద్దేశించింది. కొనుక్కున్నప్పుడే ట్రాష్ బిన్‌కు అనుసంధానంగా ఏర్పాటై వస్తుంది. కాకపోతే ఫైల్స్ ట్రాష్‌లో పడేసిన తరువాత ఫైండర్ ఆప్షన్‌లోకి వెళ్లి సెక్యూర్ ఎమ్టీ ట్రాష్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. హార్డ్‌డ్రైవ్ మొత్తాన్ని ఓవర్‌రైట్ చేయాలనుకుంటే డిస్క్ యుటిలిటీ ఆప్‌లోకి వెళ్లి ఇరేజ్ అప్షన్‌ను క్లిక్ చేయాలి. ఆ తరువాత ‘సెక్యూరిటీ ఆప్షన్’ను సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేస్తే సరి. విండోస్, ఆపిల్ పీసీలు రెండింటిలోనూ ట్రాష్బిన్ను పూర్తిగా పక్కనబెట్టి ఫైళ్లను డిలీట్ చేయాలంటే ఫైల్ ష్రెడ్డర్ సాఫ్ట్‌వేర్‌ను కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు ఫైళ్లను ఓవర్‌రైట్ చేసి శాశ్వతంగా డిలీట్ చేయవచ్చు. ఒక ఫైల్‌ను ఎన్నిసార్లు ఓవర్‌రైట్ చేయాలన్నది సాఫ్ట్‌వేరే నిర్ణయించుకుంటుంది.