Narendra Modi Warns Bitcoin Could Spoil Young Indians Urges Cooperation Of Nations: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై భారీగా ఆదరణ పెరుగుతుంది. క్రిప్టోకరెన్సీను ఆదరిస్తోన్న దేశాల్లో భారత్ కూడా ముందు స్థానాల్లో నిలుస్తోంది. భారత్‌లో సుమారు 10 కోట్ల మంది క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీపై సిడ్నీ డైలాగ్ వర్చువల్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలను చేశారు.
తప్పుడు చేతుల్లోకి వెళ్తే ప్రమాదమే..!
సిడ్నీ డైలాగ్ వర్చువల్ కీనోట్ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ‘ క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ ప్రమాదం పొంచి ఉందన్నారు. అంతేకాకుండా యువతను కూడా నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీతో ఏలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవడానికి అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్రిప్టో వ్యవహారంపై సమావేశాన్ని కూడా నిర్వహించారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: జాతీయ గీతం వింటూ కన్నీరు పెట్టుకున్న విజయ్ శేఖర్ శర్మ!
సిడ్నీ డైలాగ్ సందర్భంగా...పీఏం మోదీ తన ప్రసంగంలో....ప్రపంచ పురోగతి, శ్రేయస్సు కోసం కొత్త అవకాశాలపై దృష్టి సారించాలని అన్నారు. నేటి ప్రపంచంలో సాంకేతికత ఇప్పటికే ప్రపంచ దేశాలకు ప్రధాన సాధనంగా మారిందని వెల్లడించారు. అదే సాంకేతికత పలుదేశాలకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం లేకపోలేదని తెలిపారు.
Take crypto-currency or bitcoin for example.
— PMO India (@PMOIndia) November 18, 2021
It is important that all democratic nations work together on this and ensure it does not end up in wrong hands, which can spoil our youth: PM @narendramodi
చదవండి: క్రిప్టో కరెన్సీపై ఏం చేద్దాం? ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం
Comments
Please login to add a commentAdd a comment