
క్రిప్టోకరెన్సీపై ప్రముఖ బిలియనీర్ మార్క్ క్యూబాన్ ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రిప్టోకరెన్సీ ఏది అనే విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. క్రిప్టోకరెన్సీలోకి కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లకు పలు సూచనలను చేశారు. క్రిప్టోకరెన్సీలో..బిట్‌కాయిన్, ఈథర్, డోగీకాయిన్స్ ఎక్కువగా లాభాలను తెస్తాయని మార్క్ సూచించారు.
చదవండి: డీమార్ట్ దెబ్బకు బిలియనీర్ అయిపోయాడే...!
‘బంగారం కంటే మెరుగైనది’ బిట్‌కాయినే అని మార్క్ క్యూబాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. బంగారం కంటే బిట్‌కాయిన్ ఎక్కువ లాభాలను ఇస్తోందని పేర్కొన్నారు. డోగీకాయిన్ అత్యంత శక్తివంతమైన ట్రాన్సక్షన్ రేట్‌ను కల్గి ఉందని వెల్లడించారు.మీమ్ క్రిప్టోకరెన్సీఐనా డోగీ కాయిన్ టాప్-10 క్రిప్టోకరెన్సీలో నిలిచింది. గతంలో మార్క్ క్యూబాన్ ఎలన్‌మస్క్‌తో డోగీకాయిన్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
బిట్‌కాయిన్ దూకుడు..!
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది.క్రిప్టోకరెన్సీలో అత్యంత ఆదరణను పొందిన బిట్‌కాయిన్ మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అక్టోబర్ 15 న బిట్‌కాయిన్ 60 వేల డాలర్ల మార్కును దాటింది. దాదాపు ఆరు నెలల తర్వాత బిట్‌కాయిన్ ఈ మార్కును తాకింది. అదే రోజు ఒకానొక సమయంలో 62,535.90 డాలర్ల ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది.
చదవండి: సై అంటే సై అంటూన్న దిగ్గజ టెక్ కంపెనీలు..!
Comments
Please login to add a commentAdd a comment