Mark Cuban
-
క్రిప్టోకరెన్సీపై బిలియనీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
క్రిప్టోకరెన్సీపై ప్రముఖ బిలియనీర్ మార్క్ క్యూబాన్ ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రిప్టోకరెన్సీ ఏది అనే విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. క్రిప్టోకరెన్సీలోకి కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లకు పలు సూచనలను చేశారు. క్రిప్టోకరెన్సీలో..బిట్‌కాయిన్, ఈథర్, డోగీకాయిన్స్ ఎక్కువగా లాభాలను తెస్తాయని మార్క్ సూచించారు. చదవండి: డీమార్ట్ దెబ్బకు బిలియనీర్ అయిపోయాడే...! ‘బంగారం కంటే మెరుగైనది’ బిట్‌కాయినే అని మార్క్ క్యూబాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. బంగారం కంటే బిట్‌కాయిన్ ఎక్కువ లాభాలను ఇస్తోందని పేర్కొన్నారు. డోగీకాయిన్ అత్యంత శక్తివంతమైన ట్రాన్సక్షన్ రేట్‌ను కల్గి ఉందని వెల్లడించారు.మీమ్ క్రిప్టోకరెన్సీఐనా డోగీ కాయిన్ టాప్-10 క్రిప్టోకరెన్సీలో నిలిచింది. గతంలో మార్క్ క్యూబాన్ ఎలన్‌మస్క్‌తో డోగీకాయిన్పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. బిట్‌కాయిన్ దూకుడు..! ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది.క్రిప్టోకరెన్సీలో అత్యంత ఆదరణను పొందిన బిట్‌కాయిన్ మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అక్టోబర్ 15 న బిట్‌కాయిన్ 60 వేల డాలర్ల మార్కును దాటింది. దాదాపు ఆరు నెలల తర్వాత బిట్‌కాయిన్ ఈ మార్కును తాకింది. అదే రోజు ఒకానొక సమయంలో 62,535.90 డాలర్ల ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. చదవండి: సై అంటే సై అంటూన్న దిగ్గజ టెక్ కంపెనీలు..! -
శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ ఏదో తేల్చిచెప్పిన ఎలన్ మస్క్...!
వాషింగ్టన్: ఎలన్ మస్క్ అంటే తెలియని వారు ఎవరుండరు. హాలీవుడ్ మార్వెల్ సూపర్ క్యారెక్టర్ ఐరన్ మ్యాన్‌తో ఎలన్ మస్క్‌ను పోల్చుతారు. మార్స్, చంద్ర గ్రహంపైకి మానవులను తీసుకెళ్లాలని ఎంతగానో ఊవిళ్లురుతున్నాడు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక కంపెనీ లక్షల కోట్లను సంపాదించాలన్నా లక్షల కోట్లను క్షణాల్లో ఆవిరిచేయాలన్న టెస్లా సీఈవో, స్పెస్ ఎక్స్ అధినేత ఎలన్‌మస్క్‌కే సాధ్యం. ఒక ట్విట్ చేస్తే చాలు..అట్టడుగున ఉన్న కంపెనీలను ఎవరు ఊహించని విధంగా కంపెనీలు లాభాలను పొందేలా చేస్తాడు ఎలన్ మస్క్. ఈ మధ్య క్రిప్టోకరెన్సీ తలరాతను మార్చడంలో మస్క్ పాత్ర వివరించలేనిది. డాగీకాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ విలువ గణనీయంగా ఎదగడంలో ఎలన్‌మస్క్ పాత్ర ఎంతగానో ఉంది. డాగీకాయిన్ క్రిప్టోకరెన్సీకి ఎలన్‌మస్క్‌ను గాడ్‌ఫాదర్‌గా పిలుస్తారు. తాజాగా ఎలన్‌మస్క్ డాగీకాయిన్ క్రిప్టోకరెన్సీను మరోసారి వెనుకేసుకొచ్చారు. అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ మార్క్ క్యూబన్ తన ట్విట్లో క్రిప్టోకరెన్సీలో డాగీ కాయిన్ మీడియం ఆఫ్ ఎక్సేచేంజీలో అత్యంత శక్తివంతమైన కమ్యూనిటినీ కలిగి ఉందని వెల్లడించారు. మార్క్ క్యూబాన్ చేసిన వ్యాఖ్యలకు ఎలన్ మస్క్ మద్దతును తెలిపారు. ఈ విషయాన్ని మస్క్ తన ట్విటర్లో పేర్కొన్నారు. మార్క్ క్యూబాన్ ట్విట్‌కు రిప్లే ఇస్తూ..‘ నేను ఈ విషయాన్ని ఎప్పటినుంచో చెప్పున్నాను...’ అంటూ ఎలన్ మస్క్ ట్విటర్లో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టోకరెన్సీలో మీమ్ క్రిప్టోకరెన్సీఐనా డాగీకాయిన్‌కు అత్యంత శక్తివంతమైన మీడియం ఆఫ్ ఎక్సేచేంజ్ను కలిగి ఉందని మరోసారి ఎలన్ మస్క్ తెలిపారు. ఈ వ్యాఖ్యలతో డాగీకాయిన్ పంటపండింది. ఏకంగా 8.7 శాతం గణనీయంగా పెరిగి 0.35డాలర్ల వద్ద స్థిరపడింది. తాజాగా ఎలన్‌మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్ త్వరలోనే అంతరిక్షంలో యాడ్స్ కన్పించేలా శాటిలైట్‌ను ప్రయోగించనున్నారు. I’ve been saying this for a while — Elon Musk (@elonmusk) August 14, 2021 -
క్రిప్టో కరెన్సీలో దిట్ట.. 13 ఏళ్ల మన భారతీయ బిడ్డ!
వర్చువల్ కరెన్సీ వ్యాపారంలో ఇండియాకు చెందిన గజేశ్నాయక్ సంచలనం సృష్టిస్తున్నాడు. ఇంకా పదో తరగతి పూర్తి చేయకముందే కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని పనితీరు మెచ్చి ప్రపంచ కుబేరులు అతని సంస్థలో పెట్టుబడులు పెడుతున్నారు. సాక్షి, వెబ్‌డెస్క్: గజేశ్ నాయక్, వయస్సు 13 ఏళ్లు, చదివేది 9వ తరగతి, నివసించేది గోవా. ఇవేమీ అతని ప్రత్యేకతలు కావు. కానీ అతను నెలకొల్పిన బిజినెస్ యాప్ ఆర్థిక కార్యకలాపాల విలువ అక్షరాల యాభై కోట్ల రూపాయలకు పైమాటే. పదో తరగతి కూడా పాస్ కాకుండానే గజేశ్ ఈ ఘనత సాధించాడు. ఇండియాలో మొగ్గదశలోనే ఉన్న క్రిప్టో కరెన్సీ కార్యకలాపాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాడు. కరోనా సంక్షోభంలో స్టార్టప్‌లు ఇబ్బందులు పడుతుంటే అందుకు భిన్నంగా ముందుకెళ్తున్నాడు గజేశ్. చదువులో దిట్ట గోవా రాజధాని పనాజీలోని పీపుల్స్ హై స్కూల్ చెందిన గజేశ్ నాయక్ చిన్నప్పటి నుంచే చదువులో దిట్ట, గణితంలో మేటి. చిన్నప్పటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. అందువల్లే కరోనా కారణంగా పాఠశాలు మూత పడినప్పుడు, తన కంటే కింది తరగతి విద్యార్థుల కోసం స్టడీ కంటెంట్ రెడీ చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచాడు. పాఠశాలలు తెరుచుకోపోవడంతో న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేశాడు. సీ, సీ ప్లస్, జావా స్క్రిప్ట్, సోలిడిటీలలో ఆరితేరాడు. క్రిఫ్టోకరెన్సీపై ఫోకస్ గోవాలో 2018లో జరిగిన ఇంటర్నేషనల్ బ్లాక్ చెయిన్ సమావేశాల్లో గజేశ్ పాల్గొన్నాడు. అప్పటి నుంచే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, ఆర్టిపీషియల్ ఇంటిలిజెన్స్‌పై ఆసక్తి పెరిగింది. లాక్డౌన్ టైంలో నేర్చుకున్న కొత్త కోర్సులను తన ఆసక్తికి జత చేశాడు. కోడింగ్ రాయడం సుళువైంది. ఆ తర్వాత వర్చువల్ కరెన్సీ మార్కెటైన క్రిప్టో కరెన్సీపై ఫోకస్ చేశాడు. క్రిప్టో కరెన్సీపై అనుభవం ఉన్న నిపుణులతో చర్చలు జరిపాడు. అనంతరం తనే స్వంతంగా పాలీగజ్ పేరుతో కొత్త డీయాప్‌ను రూపొందించాడు. డీ సెంట్రలైజ్డ్ పాలిగాన్ బ్లాక్‌చైయిన్ టెక్నాలజీపై డీఫై ప్రోటోకాల్ ఆధారంగా గజేశ్ రూపొందించిన పాలిగజ్ డీయాప్ క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వ్యవహరాలను నిర్వహిస్తుంది. ఇందులో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిజినెస్‌ని ఎటువంటి చట్టపరమైన అనుమతులు, మధ్యవర్తులు, దళారులు లేకుండానే నిర్వహించవచ్చు. ఈ పద్దతిలో వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలపై ఏ ఒక్కరి పెత్తనం ఉండదు, బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రోటోకాల్‌లోనే అన్ని వ్యవహరాలు ఆటోమేటిక్‌గా జరిగిపోతుంటాయి. 7 మిలియన్ డాలర్లు పాలిగజ్లో డీయాప్పై ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే దీని నిర్వాహాణ సామర్థ్యం వన్ మిలియన్ డాలర్లకి చేరుకుంది. పాలిగజ్ యాప్ పనితీరు నచ్చడంతో ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ మార్క్ క్యూబన్ ఆసక్తి చూపించారు. తాను పెట్టుబడులు పెట్టారు. దీంతో ఇప్పుడు పాలిగజ్ నిర్వాహణ సామర్థ్యం 7 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఒక 13 ఏళ్ల భారతీయ బాలుడు స్థాపించిన పాలిగజ్ యాప్ అమెరికన్లు సైతం ఆశ్చర్యపరిచే రీతిలో పెర్ఫ్మామ్ చేస్తోంది. డీఫై ప్రోటోకాల్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. -
రజత్ గుప్తా కార్యకలాపాలు షురూ!
♦ స్నేహితుడు ఛటర్జీ కంపెనీలో.. ఇంటి నుంచే పని ♦ రెండు నెలలుగా ఇంట్లోనే నిర్బంధంలో... ♦ ఇపుడు స్వేచ్ఛ రావటంతో పూర్తిస్థాయి కార్యకలాపాలు ♦ మునుపటి ప్రతిష్ఠ కోసం కోర్టులోనూ పోరు మార్క్ క్యూబన్ తెలుసా? బిలియనీర్ ఇన్వెస్టర్ మాత్రమే కాదు. అమెరికాకు చెందిన డల్లాస్ మావెరిక్స్ బాస్కెట్‌బాల్ జట్టు యజమాని కూడా. ఇక అమెరికన్ టీవీ చానెళ్లు చూసేవారిలో లైఫ్‌స్టైల్ స్టార్ మార్తా స్టివార్ట్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో!! వీరి గురించి ఇపుడెందుకంటే... 2004లో 44 ఏళ్ల క్యూబన్ తన ఇంటర్నెట్ సెర్చ్ కంపెనీ ‘మమ్మా.కామ్’లో వాటాలు విక్రయించారు. సమాచారం తెలిసి వాటాల్ని ముందే విక్రయించి, నష్టాలు తగ్గించుకున్నారని, ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై అమెరికన్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజీ కమిషన్ (సెక్) కేసు పెట్టింది. 2015 వరకూ ఈ కేసు నడిచింది. కోర్టు ఫీజులు, లాయర్ల ఫీజుల రూపంలో... సెక్ పేర్కొన్న జరిమానా కన్నా ఎక్కువే క్యూబన్ చెల్లించారు. 2015లో క్యూబన్ గెలిచి.. నిర్దోషిగా బయటపడ్డారు. దాతగా ఇపుడు పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. క్యూబన్కిపుడు 56 ఏళ్లు. మార్తా స్టివార్ట్దీ ఇలాంటి కథే. ఆమె 2001లో ‘ఐఎంక్లోన్’ కంపెనీలో 2.3 లక్షల డాలర్ల విలువైన తన షేర్లు అమ్మేశారు. ఆ మర్నాడే షేరు ధర కుప్పకూలింది. దీనిపై ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలొచ్చి, అవి రుజువై ఆమెకు జైలు శిక్ష కూడా పడింది. శిక్ష పూర్తయి బయటకు వచ్చాక... ఆమె మళ్లీ టీవీ షోలలో పాల్గొన్నారు. తన కంపెనీ బోర్డులో కూడా మళ్లీ స్థానం సంపాదించుకున్నారు. ఇవన్నీ ఎందుకంటే... హైదరాబాద్‌లోని ఐఎస్బీ వ్యవస్థాపకుల్లో ఒకరైన రజత్ గుప్తా... ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై రెండేళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకుని రెండురోజుల కిందటే విడుదలయ్యారు. ఒకప్పుడు మెకిన్సే ఎండీగా, గోల్డ్‌మన్ శాక్స్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన రజత్ గుప్తా... నిజానికి జనవరి 5నే అమెరికా ఫెడరల్ కరెక్షనల్ కేంద్రం నుంచి విడుదలయ్యారు. అప్పటి నుంచీ మన్‌హటన్‌లోని తన ఇంట్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. అపార్ట్మెంట్ నుంచి బయటకు రాకుండా... చేతికి జైలు అధికారులిచ్చే బ్రేస్‌లెట్‌ను ధరించి ఉండేవారు. అయితే కరెక్షనల్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన దగ్గర్నుంచీ మెకిన్సేకు చెందిన తన పాత మిత్రుడు పూర్ణేందు ఛటర్జీ నిర్వహిస్తున్న వ్యాపారం కోసం పనిచేసేవారని ‘న్యూయార్క్’ టైమ్స్ వెల్లడించింది. నిజానికి గుప్తాకు జైలు శిక్ష పడినపుడు ఆయన్ను గట్టిగా సమర్థించింది ఛటర్జీ ఒక్కరే. తాజాగా గుప్తా పూర్తిస్థాయిలో విడుదల కావటంతో ఇకపై ఆయన పూర్తిస్థాయిలో కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని తెలుస్తోంది. రెండువారాల కిందటే కోర్టు స్వీకరణ నిజానికి మళ్లీ బిజినెస్‌లోకి ప్రవేశించటం మాత్రమే కాదు. తనపై పడ్డ మచ్చను చెరుపుకోవటం కూడా గుప్తా మనసులో ఉన్న ఆలోచనగా చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లో అమెరికాలోని మన్‌హటన్‌లో ఉన్న పప్పీళ్ల సెకండ్ సర్క్యూట్ కోర్ట్... గుప్తా వేసిన ఈప్పీలును విచారణకు స్వీకరించింది కూడా. రాజరత్నం నుంచి గుప్తాకు కనిపించని లాభమేదీ రాలేదని గుప్తా తరఫు న్యాయవాది చేసిన వాదనతో కోర్టు ఏకీభవించి ఈ అపీలును తీసుకుంది. కేసు నుంచి బయటపడి మునుపటి తన పరువు ప్రతిష్ఠల్ని తిరిగి సంపాదించుకోవటం కూడా గుప్తా ఆలోచనగా తెలుస్తోంది.