శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ ఏదో తేల్చిచెప్పిన ఎలన్‌ మస్క్‌...!  | Elon Musk Agrees With Billionaire Entrepreneur Mark Cuban Claim | Sakshi
Sakshi News home page

Elon Musk: శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ ఏదో తేల్చిచెప్పిన ఎలన్‌ మస్క్‌...!

Published Mon, Aug 16 2021 5:30 PM | Last Updated on Mon, Aug 16 2021 5:33 PM

Elon Musk Agrees With Billionaire Entrepreneur Mark Cuban Claim - Sakshi

వాషింగ్టన్‌: ఎలన్‌ మస్క్‌ అంటే తెలియని వారు ఎవరుండరు. హాలీవుడ్‌ మార్వెల్‌ సూపర్‌ క్యారెక్టర్‌ ఐరన్‌ మ్యాన్‌తో ఎలన్‌ మస్క్‌ను పోల్చుతారు. మార్స్‌, చంద్ర గ్రహంపైకి మానవులను తీసుకెళ్లాలని ఎంతగానో ఊవిళ్లురుతున్నాడు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.  ఒక కంపెనీ లక్షల కోట్లను సంపాదించాలన్నా లక్షల కోట్లను క్షణాల్లో ఆవిరిచేయాలన్న  టెస్లా సీఈవో, స్పెస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌మస్క్‌కే సాధ్యం.

ఒక ట్విట్‌ చేస్తే చాలు..అట్టడుగున ఉన్న కంపెనీలను ఎవరు ఊహించని విధంగా కంపెనీలు లాభాలను పొందేలా చేస్తాడు ఎలన్‌ మస్క్‌. ఈ మధ్య క్రిప్టోకరెన్సీ తలరాతను మార్చడంలో మస్క్‌ పాత్ర వివరించలేనిది. డాగీకాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీ విలువ గణనీయంగా ఎదగడంలో ఎలన్‌మస్క్‌ పాత్ర ఎంతగానో ఉంది. డాగీకాయిన్‌ క్రిప్టోకరెన్సీకి ఎలన్‌మస్క్‌ను గాడ్‌ఫాదర్‌గా పిలుస్తారు. తాజాగా ఎలన్‌మస్క్‌ డాగీకాయిన్‌ క్రిప్టోకరెన్సీను మరోసారి వెనుకేసుకొచ్చారు.

అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్‌ మార్క్‌ క్యూబన్‌ తన ట్విట్‌లో క్రిప్టోకరెన్సీలో డాగీ కాయిన్‌ మీడియం ఆఫ్‌ ఎక్సేచేంజీలో అత్యంత శక్తివంతమైన కమ్యూనిటినీ కలిగి ఉందని వెల్లడించారు. మార్క్‌ క్యూబాన్‌ చేసిన వ్యాఖ్యలకు ఎలన్‌ మస్క్‌ మద్దతును తెలిపారు. ఈ విషయాన్ని మస్క్‌ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. మార్క్‌ క్యూబాన్‌ ట్విట్‌కు రిప్లే ఇస్తూ..‘ నేను ఈ విషయాన్ని ఎప్పటినుంచో చెప్పున్నాను...’ అంటూ ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టోకరెన్సీలో మీమ్‌ క్రిప్టోకరెన్సీఐనా డాగీకాయిన్‌కు అత్యంత శక్తివంతమైన మీడియం ఆఫ్‌ ఎక్సేచేంజ్‌ను కలిగి ఉందని మరోసారి ఎలన్‌ మస్క్‌ తెలిపారు. ఈ వ్యాఖ్యలతో డాగీకాయిన్‌ పంటపండింది. ఏకంగా 8.7 శాతం గణనీయంగా పెరిగి 0.35డాలర్ల వద్ద స్థిరపడింది. తాజాగా ఎలన్‌మస్క్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌ త్వరలోనే అంతరిక్షంలో యాడ్స్‌ కన్పించేలా శాటిలైట్‌ను ప్రయోగించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement