
న్యూయార్క్: ఇన్వెస్ట్‌మెంట్ గురు.. వారెన్ బఫెట్ బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ లు చివరకు కన్నీళ్లే మిగులుస్తాయని వ్యాఖ్యానించారు. బిట్‌కాయిన్ ఒక జోక్ అని 2014లోనే ఆయన పేర్కొనడం విశేషం. అప్పటి నుంచి ఇప్పటిదాకా బిట్‌కాయిన్ వేల రెట్లు పెరిగినప్పటికీ, ఆయన తన దృక్పథాన్ని మార్చుకోలేదు.
తనకు కొద్దో, గొప్పో తెలిసిన విషయాలపైనే ఎంతో కొంత గందరగోళానికి గురవుతున్నానని, ఏమీ తెలియని బిట్‌కాయిన్‌లో పెట్టుబడి ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. క్రిప్టో కరెన్సీల పై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్న తరుణంలో బఫెట్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.