
సిల్వర్‌స్ప్రింగ్(యూఎస్): ఎలక్ట్రిక్ కార్ల గ్లోబల్ దిగ్గజం టెస్లా.. డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. అంతేకాకుండా త్వరలో ఈ డిజిటల్ కరెన్సీని చెల్లింపులకూ అనుమతించే ప్రణాళికల్లో ఉంది. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం ఉదయం బిట్‌కాయిన్ విలువ 15 శాతం జంప్‌చేసింది. 43,000 డాలర్లను తాకింది. ఒక దశలో 43,863 డాలర్ల వద్ద రికార్డ్ గరిష్టాన్ని చేరింది. హైఎండ్ వాహనాల కొనుగోలుకి బిట్‌కాయిన్‌లో చెల్లింపులను అనుమతించే ఆలోచనలో ఉన్నట్లు టెస్లా తాజాగా పేర్కొంది. డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులపై ఆటో దిగ్గజం టెస్లా.. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజీకి వివరాలు దాఖలు చేసింది. ఇతర ప్రత్యామ్నాయ రిజర్వ్ అసెట్స్ పురోగమించే వీలున్నట్లు అభిప్రాయపడింది.