సింగపూర్: వర్చువల్ కరెన్సీల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ‘బిట్‌కాయిన్’ బుధవారం తొలిసారిగా 10వేల డాలర్ల మైలురాయిని అధిగమించింది. అదే స్పీడ్‌లో 11 వేల డాలర్లను కూడా దేటేసింది. ఒకేరోజులో ఈ రెండు మైలురాళ్లను చేరడం విశేషం. తాజా జోరుతో బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ దాదాపు 200 బిలియన్ డాలర్లకు చేరువైంది. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న విలువతో పోలిస్తే(దాదాపు 750 డాలర్లు) బిట్‌కాయిన్ 10 రెట్లకు పైగా ఎగబాకడం గమనార్హం. డిజిటల్ గోల్డ్‌గా కూడా అభివర్ణించే బిట్‌కాయిన్ ప్రస్థానం 2009లో మొదలైంది. ప్రారంభంలో ఒక డాలర్ కంటే తక్కువగా ఉన్న ఈ బిట్‌కాయిన్‌కు ఎలాంటి లీగల్ ఎక్సే్చంజ్ రేట్ కానీ, ఏ దేశ కేంద్ర బ్యాంక్ దన్ను కానీ లేదు. కొన్ని స్పెషలిస్ట్ ప్లాట్‌ఫామ్‌లపై ట్రేడయ్యేది. కానీ చాలా వేగంగా సాం ప్రదాయ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ప్రత్యామ్నాయంగా ప్రాచుర్యం సంపాదించుకుంది.
ఏడాదిన్నరలో లక్ష డాలర్లకు...!
ఎక్సే్చంజ్ దిగ్గజం సీఎంఈ గ్రూప్ గత నెలలో బిట్‌కాయిన్‌లో ఫ్యూచర్స్‌ను ప్రారంభించనున్నామని వెల్లడించడంతో బిట్‌కాయిన్ జోరు మరింతగా పెరిగింది. కేవలం రెండు వారాల్లో 45 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరిలో దీని విలువ 752 డాలర్లుగా ఉంది. బిట్‌కాయిన్ జోరు మరింతగా పెరుగుతుందని, ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంలో ఇది 50 వేల నుంచి లక్ష డాలర్లకు పెరుగుతుందని సింగపూర్ శాక్సో బ్యాంక్‌కు చెందిన క్రిప్టో స్ట్రాటజిస్ట్ కే వాన్–పీటర్సన్ చెప్పారు. కాగా మన కాలానికి సంబంధించి అతి పెద్ద బబుల్‌గా బిట్‌కాయిన్ నిలవనున్నదని ప్రముఖ హెడ్జ్ ఫండ్ మేనేజర్ మైక్ నొవొగ్రాజ్ హెచ్చరించారు. కాగా, ఈ వర్చువల్ కరెన్సీని ఫ్రాడ్‌గా జేపీ మోర్గాన్ ఛేజ్ గతంలో అభివర్ణించింది. చైనా, దక్షిణ కొరియాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment