ఒక్క క్షణం చాలు జీవితం తలక్రిందులు కావడనికి. ప్రధానంగా ఈ మాట స్టాక్ మార్కెట్ లలో ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో ఎలాన్ మస్క్ చేసిన కొన్ని ట్విట్ల కారణంగా స్టాక్ మార్కెట్ ద్వారా లక్షల కోట్లు నష్టపోయాడు. తాజాగా మరోసారి చేసిన ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్లు నష్ట పోయాడు. ఇటీవల బిట్ కాయిన్ విలువ రాకెట్ వేగంగా దూసుకెళ్తుంది. అయితే, బిట్ కాయిన్ షేర్ విలువ పెరుగుతుండడంపై ట్విటర్ లో ఎలాన్ మస్క్ స్పందించారు. "బిట్ కాయిన్, ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా" కనిపిస్తోందని ఫిబ్రవరి 20న ట్వీట్ చేశారు. దీనితో టెస్లా ఈక్విటీ వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. ఈ ఒక్క ట్వీట్ తో 15.2 బిలియన్ డాలర్లు(సుమారు లక్ష కోట్లు) కోల్పోయాడు. టెస్లా సంస్థ ఈక్విటీ విలువ కూడా పడిపోయింది. త్వరలో బిట్ కాయిన్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్న ఎలాన్ 1.5 బిలియన్ డాలర్ల విలువైన కాయిన్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా కోట్లు నష్టపోవడం మొదటిసారి కాదు గతంలో “టెస్లా స్టాక్ ధర చాలా ఎక్కువ” అంటూ చేసిన ట్విట్ కి 14 బిలియన్ డాలర్లు నష్టపోయాడు.
That said, BTC & ETH do seem high lol
— Elon Musk (@elonmusk) February 20, 2021
Comments
Please login to add a commentAdd a comment