
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ విలువ పెరుగుతూనే ఉంది. పలు క్రిప్టోకరెన్సీలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. తాజాగా బిట్‌కాయిన్ శుక్రవారం (ఆగస్టు 13) రోజున 7.07 శాతం పెరిగి 47,587.38 డాలర్ల(సుమారు రూ. 35,31,800) వద్ద స్థిర పడింది. బిట్‌కాయిన్ సుమారు 3142.93 డాలర్లు వృద్ధి చెందింది. ప్రపంచంలోని అతిపెద్ద అత్యంత ప్రసిద్ధ క్రిప్టోకరెన్సీ ఐనా బిట్‌కాయిన్ విలువ జనవరి నెలలో సుమారు 27,734 డాలర్ల కనిష్ట స్థాయి చేరుకుంది.
ప్రస్తుతం బిట్‌కాయిన్ 71.6 శాతం వృద్ధి చెంది 47,587.38 డాలర్ల వద్ద స్థిరపడింది. మరో క్రిప్టోకరెన్సీ ఈథిరియం టెక్నికల్ అప్‌గ్రేడ్స్ చేస్తోన్నందున్న బిట్‌కాయిన్ ఈ స్థాయిలో గణనీయంగా వృద్ధి చెందిందని పన్టేరా క్యాపిటల్ సీఈవో మోర్‌హోడ్ పేర్కొన్నారు. ఈథిరియం కూడా సుమారు 7.86 శాతం పెరిగి 3284.18 (సుమారు రూ. 2,43,000) వద్ద స్థిర పడింది.
Comments
Please login to add a commentAdd a comment