
న్యూఢిల్లీ: దేశీ బిట్‌కాయిన్ ఎక్సేంజీల్లో ఆదాయపన్ను శాఖ బుధవారం ఆకస్మిక తనిఖీలకు దిగింది. అధికార బృందాలు దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్రధాన బిట్‌కాయిన్ ఎక్స్చేంజి లలో విచారణ నిర్వహించగా, అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లు (హెచ్‌ఎన్‌ఐ) జరిపిన లక్షలాది లావాదేవీల సమాచారం వెలుగు చూసింది. బిట్‌కాయిన్‌లో ట్రేడింగ్ ద్వారా వచ్చిన లాభాలపై పన్ను ఎగవేతకు సంబంధించి వివరాలు ఆరాతీసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
బెంగళూరు విభాగం పర్యవేక్షణలో పలు దర్యాప్తు బృందాలు బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, కోచి, గురుగ్రామ్, ఘజియాబాద్, పుణె తదితర ప్రాంతాల్లోని 9 ప్రధానఎక్స్చేంజి లకు బుధవారం ఉదయం వెళ్లాయి. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 133ఏ కింద ఇన్వెస్టర్లు, ట్రేడర్ల గుర్తింపు వివరాలు, లావాదేవీలు, బ్యాంకు ఖాతాల సమాచారం, ఇతర ఆధారాలను సేకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఎక్స్చేంజి లకు సంబంధించిన అన్ని ఆర్థిక వివరాలు, డేటాను కూడా సేకరించాయి. ప్రాథమిక సమాచారం మేరకు 20–25 లక్షల వరకు హెచ్‌ఎన్‌ఐల సమాచారం లభ్యమైంది. వీటిలో 8–10 లక్షల సంస్థలు లావాదేవీల పరంగా చురుగ్గా ఉన్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment