
ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ ఏది అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బిట్‌కాయిన్. ప్రస్తుతం ఉన్న అన్నీ క్రిప్టోకరెన్సీల్లో కంటే బిట్‌కాయిన్ కు ఎక్కువ ఆదరణ లభించింది. అయితే, ఈ బిట్‌కాయిన్ ధర గత కొద్ది రోజుల నుంచి భారీగా పడిపోతుంది. సెప్టెంబర్ 20న 43,000 డాలర్లుగా ఉన్న ధర నిన్న ఒక్కసారిగా సుమారు 40000 డాలర్లకు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం చైనా డెవలపర్ ఎవర్‌గ్రాండే సంక్షోభంలో కూరుకు పోవడమే అని నిపుణులు భావిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ మార్కెట్ పై ఈ ప్రభావం కొద్ది రోజుల వరకు ఉండే అవకాశం ఉంది అని విశ్లేషకుల అభిప్రాయం.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉన్న ఈటీహెచ్ విలువ కూడా 5.07 శాతం క్షీణించింది. ఎథెరియం బ్లాక్ చైన్ అధికారిక క్రిప్టోకరెన్సీ. ఈథర్ ప్రస్తుత మారకం విలువ సుమారు 3,000 డాలర్లుగా ఉంది. చైనా డెవలపర్ ఎవర్‌గ్రాండే సంక్షోభం ప్రపంచంలోని బిలియనీర్ల సంపదకు గండి కొట్టింది. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులైన ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, వారెన్ బఫెట్ తదితర బిలియనీర్లు ఏకంగా సుమారు 26 బిలియన్ల డాలర్లకు పైగా నష్టపోయారు.(చదవండి: బిట్‌కాయిన్ సృష్టికర్త ఎవరో తెలుసా...!)