
డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్ రికార్డు పరుగు కొనసాగుతోంది. తాజాగా 50,000 డాలర్ల (దాదాపు రూ.36.5 లక్షలు) మైలురాయిని తొలిసారిగా అధిగమించింది. మంగళవారం ట్రేడింగ్‌లో ఒక దశలో 50,515 డాలర్ల స్థాయిని కూడా తాకింది. గడిచిన మూడు నెలల్లోనే బిట్‌కాయిన్ రేటు 200 శాతం పైగా పెరగడం గమనార్హం. ఏడాది క్రితం దీని విలువ 10.000 డాలర్ల స్థాయిలో ఉండేది. ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కంపెనీలు ఈ డిజిటల్ కరెన్స్ వైపు మొగ్గుచూపుతుండటంతో బిట్‌కాయిన్ భారీగా ర్యాలీ చేస్తోంది. ఎలక్టిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా ఇటీవలే 1.5 బిలియన్ డాలర్ల విలువ చేసే కరెన్సీ కొనుగోలు చేస్తున్నట్లు, కార్ల కొనుగోలుకు బిట్‌కాయిన్‌తో కూడా చెల్లింపులు స్వీకరించనున్నట్లు ప్రకటించడంతో దీనికి మరింత ఊతం లభించింది. అమెరికాలోని వర్జీనియాకు చెందిన బ్లూ రిడ్జ్ బ్యాంక్ తమ ఏటీఎంలు, శాఖల్లో బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయొచ్చంటూ ప్రకటించింది. ఆ తర్వాత బీఎన్‌వై మెలాన్ అనే బ్యాంకు కూడా తమ క్షయింట్లకు అందించే సర్వీసుల్లో డిజిటల్ కరెన్సీలను కూడా చేర్చనున్నట్లు పేర్కొంది.(చదవండి: బిట్ కాయిన్‌కు కెనడా గ్రీన్ సిగ్నల్)
Comments
Please login to add a commentAdd a comment