bitcoin payment
-
అంతా నా ఇష్టం, 7లక్షల కోట్లు ఆవిరి
తన మాటలతో బిజినెస్ ప్రపంచాన్ని శాసించే టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్లాకు చెందిన కార్లను కొనుగోలు చేసేందుకు బిట్కాయిన్ల(క్రిప్టో)ను అనుమతిస్తున్నట్లు ప్రకటించి మరోసారి హాట్ టాపిగ్గా మారారు. అయితే ఇదే బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్లను వ్యతిరేకిస్తూ మే13 ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ దెబ్బకు బిట్ కాయిన్ విలువ 15శాతం క్షీణించింది 56 వేల డాలర్ల నుంచి ఒక్కసారిగా 46వేల డాలర్లకు పడిపోయింది. దీంతో క్రిప్టో పెట్టుబడిదారులు కంగుతిన్నారు. Tesla & Bitcoin pic.twitter.com/YSswJmVZhP — Elon Musk (@elonmusk) May 12, 2021 తాజాగా క్రిప్టోకి సపోర్ట్ చేస్తూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ మేనేజ్మెంట్కు చెందిన 'ఏఆర్కే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్' సంస్థ ఆర్థిక సాధికారత సాధనంగా బిట్‌కాయిన్(Bitcoin as a Tool for Economic Empowerment) అనే అంశంపై చర్చించింది. ఈ చర్చలో పాల్గొన్న మస్క్ బిట్ కాయన్ పై ప్రకటన చేశారు. 7లక్షల కోట్లు ఆవిరి ఏప్రిల్ నెల ప్రారంభంలో 65,000 డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ ధర.. ఏప్రిల్ 19(సోమవారం) రాత్రి 30వేల డాలర్లకు పడిపోయింది. దీంతో రూ.7 లక్షల కోట్ల (98 బిలియన్ల డాలర్లు) మేరకు నష్టపోయారు. అయితే రెండు రోజుల పాటు అలాగే కొనసాగినా గురువారం మార్కెట్లో 6.3 శాతం పెరగడంతో క్రిప్టో విలువ 31,547.88 డాలర్లకు చేరింది. ఇప్పుడు మరోసారి క్రిప్టో విలువ భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వివిధ కారణాలతో క్రిప్టోవిలువ భారీగా పడిపోయినా ఇప్పుడు ఎలాన్ మస్క్ ప్రకటనతో తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఐఆర్సీటీసీలో నెలకు రూ.30 - 80 వేలు సంపాదించండిలా ! -
రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్‌కాయిన్
డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్ రికార్డు పరుగు కొనసాగుతోంది. తాజాగా 50,000 డాలర్ల (దాదాపు రూ.36.5 లక్షలు) మైలురాయిని తొలిసారిగా అధిగమించింది. మంగళవారం ట్రేడింగ్‌లో ఒక దశలో 50,515 డాలర్ల స్థాయిని కూడా తాకింది. గడిచిన మూడు నెలల్లోనే బిట్‌కాయిన్ రేటు 200 శాతం పైగా పెరగడం గమనార్హం. ఏడాది క్రితం దీని విలువ 10.000 డాలర్ల స్థాయిలో ఉండేది. ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కంపెనీలు ఈ డిజిటల్ కరెన్స్ వైపు మొగ్గుచూపుతుండటంతో బిట్‌కాయిన్ భారీగా ర్యాలీ చేస్తోంది. ఎలక్టిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా ఇటీవలే 1.5 బిలియన్ డాలర్ల విలువ చేసే కరెన్సీ కొనుగోలు చేస్తున్నట్లు, కార్ల కొనుగోలుకు బిట్‌కాయిన్‌తో కూడా చెల్లింపులు స్వీకరించనున్నట్లు ప్రకటించడంతో దీనికి మరింత ఊతం లభించింది. అమెరికాలోని వర్జీనియాకు చెందిన బ్లూ రిడ్జ్ బ్యాంక్ తమ ఏటీఎంలు, శాఖల్లో బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయొచ్చంటూ ప్రకటించింది. ఆ తర్వాత బీఎన్వై మెలాన్ అనే బ్యాంకు కూడా తమ క్షయింట్లకు అందించే సర్వీసుల్లో డిజిటల్ కరెన్సీలను కూడా చేర్చనున్నట్లు పేర్కొంది.(చదవండి: బిట్ కాయిన్‌కు కెనడా గ్రీన్ సిగ్నల్) -
పోర్న్ సైట్లలో ఫొటో వస్తుంది.. జాగ్రత్త!
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో ఓ 30 ఏళ్ల మహిళను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. బిట్కాయిన్ల రూపంలో 2 కోట్ల రూపాయలు చెల్లించాలని, లేకపోతే ఆమె ఫొటోలను వరుసపెట్టి పోర్నోగ్రాఫిక్ సైట్లలో పెడుతూనే ఉంటామని ఈ మెయిల్ ద్వారా హెచ్చరించారు. దీనిపై ఆమె ఫిర్యాదుచేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఈమెయిల్ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని జబల్పూర్ ఎస్పీ ఆశిష్ తెలిపారు. ఓపెద్ద కుటుంబానికి చెందిన ఆ మహిళ.. ఈ తరహా ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఆమె వ్యక్తిగత సమాచారం, నగ్న ఫొటోలు అన్నింటినీ ఆమె సోషల్ మీడియా కాంటాక్టులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చేరవేయడంతో పాటు పోర్న్ సైట్లలో కూడా పెడతామని.. ఇదంతా జరగకూడదంటే బిట్కాయిన్ల రూపంలో 2 కోట్లు చెల్లించాలని ఆ ఈ మెయిల్లో పేర్కొన్నారు. పైగా అందుకు పెద్ద సమయం కూడా ఇవ్వలేదని ఎస్పీ చెప్పారు. అయితే ఇలాంటి కేసులను విచారించడం అంత సులభంగా అయ్యే పని కాదని పోలీసలు అంగీకరించారు. నిందితులు టీఓఆర్ బ్రౌజర్లు వాడటం వల్ల వాళ్ల సెర్వర్లు ఎక్కడున్నాయో గుర్తించడం కష్టమని, అలాగే బిట్కాయిన్ల రూపంలో చెల్లింపు వల్ల దాన్ని ట్రేస్ చేయడం మరింత క్లిష్టమని అన్నారు.