న్యూయార్క్: ఒకవైపు బిట్‌కాయిన్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన, పలురకాల నిషేధం కొనసాగుతోంటే ఉబెర్ కో ఫౌండర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీర్-టు-పీర్ రైడ్ షేరింగ్, ఫుడ్ డెలివరీ, ట్రావెల్ నెట్‌వర్క్ సంస్థ ఉబెర్ సహ వ్యవస్థాపకుడు గ్యారెట్ క్యాంప్ త్వరలో కొత్త క్రిప్టోకరెన్సీని లాంచ్ చేయనునున్నారు. యాక్సిలరేటర్ ఫండ్ ఎక్స్‌పా ఫౌండర్ కూడా అయిన క్యాంప్ ‘ఎకో’ పేరుతో కొత్త బిట్‌కాయిన్‌ను అందుబాటులోకి తేనున్నారు. దీన్ని డిజిటల్ గ్లోబల్ కరెన్సీగా మార్చాలని ఆయన భావిస్తున్నారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా రోజువారీ వినియోగ లావాదేవీలకు ఒక ప్రధాన పేమెంట్ సాధనంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. క్యాంప్‌తో పాటు ఎక్స్‌పా అనుబంధంగా ఉన్న కొందరు భాగస్వాములు కూడా ఈ ప్రాజెక్ట్ ఆపరేటింగ్ బడ్జెట్‌లో 10 మిలియన్ డాలర‍్ల పెట్టుబడులను సమకూర్చారు.
టెక్ క్రంచ్ అందించిన సమాచారం ప్రకారం ప్రాథమికంగా ఒక ట్రిలియన్ టోకెన్లను జారీ చేయనున్నారు. వీటిలో సగం ధృవీకరించబడిన అకౌంట్లకు కేటయిస్తారు. మిగిలిన సగంలో 20శాతం విశ్వవిద్యాలయాలు నడుపుతున్న విశ్వసనీయ సంస్థలకు, 10శాతం అడ్వైజర్లకు, 10శాతం వ్యూహాత్మక భాగస్వాములకు కేటాయిస్తారు. ఇక మిగిలిన పది శాతాన్ని నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ నిర్వహణ, బాధ్యతలకోసం కొత్తగా ఏర్పాటయ్యే ఇకో ఫౌండేషన్‌కు కేటాయిస్తారు. 51శాతం సెక్యూరిటీ ఎటాక్స్‌ను, మోసాలను, ఇతర సమస్యలను తొలగిస్తుందనీ, ఎకోను ఎవరూ విచ్ఛినం చేయలేరని ధీమాగా చెబుతున్నారు.
అంతేకాదు క్రిప్టోకరెన్సీ లావాదేవీల్లో ఉండే కొన్ని ప్రధాన సమస్యల్ని అధిగమించాలని భారీ కసరత్తు చేస్తోంది. అదేవిధంగా తమ కొత్త బిట్‌కాయన్ ఎకోను మరింత యూజర్ ఫ్రెండ్లీ గా రూపొందించాలని భావిస్తోంది. ముఖ్యంగా టెక్నికల్ సామర్ధ్యంతో సంబంధం లేకుండా వెబ్, మొబైల్ యాప్ ప్లాట్‌ఫారంలలాగా వినియెగారులకు సులభంగా అందుబాటులో ఉండాలని యోచిస్తోంది. టోకెన్ జనరేషన్, ట్రాన్సాక్షన్ వెరిఫికేషన్ సందర్భంలోనూ మరింత శక్తివంతంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment