ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పేరొందిన బిట్‌కాయిన్ కొత్త ఏడాదిలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది. గత వారమే 30 వేల డాలర్లను దాటిన బిట్‌కాయిన్ ఈ వారం ముగిసే సరికి 40 వేల డాలర్లను తాకింది. 2021లో మొదటి మూడు రోజుల్లోనే దీని విలువ 5 వేల డాలర్లు పెరిగింది. 2017 నుంచి క్రమంగా పెరుగుతూ పోతున్న ఈ క్రిప్టోకరెన్సీ 2020 డిసెంబర్ 16న మొదటిసారి 20 వెల డాలర్లు నమోదైంది. అప్పటి నుంచి ఈ క్రిప్టో కరెన్సీ విలువ రాకెట్ కన్నా ఎక్కువ స్పీడ్ తో దూసుకెళ్తుంది. డిసెంబర్ 25వ తేదీ నాటికీ 25వేల డాలర్లు, 27వ తేదీ నాటికీ 27వేల డాలర్లకు పైగా చేరుకుంది. 2021 మొదటి వారంలోనే దీనివిలువ సుమారు 30 వేల డాలర్లకు పైగా చేరుకుంది. భవిష్యత్ లో లక్ష డాలర్లకు పైగా చేరుకొనునట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. కరోనా సంక్షోభం, అమెరికా నూతన అధ్యక్షుడిగా జోబిడెన్ ఎన్నిక కావడం కారణంగా పెట్టుబడిదారుల ఆలోచనలు మారుతున్నాయి. ఇదే ఇప్పుడు క్రిప్టోకరెన్సీ వాల్యూ పెరగడానికి ప్రధాన కారణమైంది.(చదవండి: వచ్చే వారం మార్కెట్లకు ఐటీ జోష్)
Comments
Please login to add a commentAdd a comment