బిట్‌కాయిన్
బిట్‌కాయిన్ భారీగా బ్లాస్ట్ అయింది. నేడు ఏకంగా 20 శాతం మేర కిందకి పడిపోయింది. మూడు నెలల కాలంలో తొలిసారి 6,200 డాలర్ల మార్కు కిందకి వచ్చి చేరింది. ఇటీవల కాలంలో ప్రపంచంలో ప్రధాన మార్కెట్లలో క్రిప్టోకరెన్సీకి ఎదురుదెబ్బలు తగులుతుండటంతో దీని విలువ భారీగా కుదేలవుతోంది. నవంబర్ మధ్య నుంచి తొలిసారి ఈ వర్చ్యువల్ కరెన్సీ 6,190 డాలర్లకు పడిపోయిందని బ్లూమ్‌బర్గ్ రిపోర్టు చేసింది.
క్రిప్టోమార్కెట్‌కు పలు దేశాల నుంచి కఠినతరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. చైనా, రష్యా, దక్షిణ కొరియా లాంటి అతిపెద్ద మార్కెట్ల ప్రభుత్వాలు దీనిపై నిషేధం విధిస్తున్నాయి. పేమెంట్ సిస్టమ్‌లో క్రిప్టోకరెన్సీలను వాడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని భారత్ కూడా ప్రకటించింది. హ్యాకర్లు 530 మిలియన్ డాలర్లు వర్చ్యువల్ కరెన్సీని దొంగలించడంతో, ఆ కరెన్సీ ఎక్స్చేంజ్‌పై జపాన్ అథారిటీలు రైడ్ కూడా చేశారు.
రుణ భయాలతో పలు కమర్షియల్ లెండర్లు క్రెటిట్ కార్డుల ద్వారా బిట్‌కాయిన్లను కొనుగోలు చేయడాన్ని కస్టమర్లకు నిరాకరించాయి. యూరప్, జపాన్, అమెరికా సెంట్రల్ బ్యాంకులు కూడా బిట్‌కాయిన్లపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దీంతో బిట్‌కాయిన్ భారీగా కిందకి పడిపోతుంది. అటు ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment