ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్ ట్విట్టర్‌లో తన డిస్‌ప్లే పేరును మార్చుకున్నాడు. టెస్లా కంపెనీలో తన షేర్లను అమ్మేయాలనుకుంటున్నాను అని ప్రకటించిన రెండు రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నేమ్ ఛేంజ్
టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల యజమాని అయిన ఎలన్‌మస్క్ తీరు మిగిలిన బిజినెస్ టైకున్లకు భిన్నంగా ఉంటుంది. సంప్రదాయ పద్దతులకు ఎప్పుడు సవాల్ విసరడం ఎలన్‌మస్క్‌కి అలవాటుగా మారింది. ఆ పరంపరలోనే అకస్మాత్తుగా ట్విట్టర్‌లో తన డిస్‌ప్లే నేమ్‌ని ఎలన్ మస్క్ బదులుగా లార్డ్ ఎడ్జ్ (Lorde Edge)గా మార్చేసుకున్నారు.
Much is made lately of unrealized gains being a means of tax avoidance, so I propose selling 10% of my Tesla stock.
— Lorde Edge (@elonmusk) November 6, 2021
Do you support this?
తికమక పడ్డ యూజర్లు
ఎలన్‌మస్క్‌కి ట్విట్టర్‌లో 60.20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఉన్నట్టుంటి తమ లిస్టులో ఈ లార్డే ఎడ్జ్ ఎవరా అని విస్తుపోయారు. అయితే డిస్‌ప్లే పేరును మాత్రమే మార్చుకున్న మస్క్ డిస్‌ప్లే పిక్చర్‌గా రాకెట్‌ను ఉంచుకోవడంతో కొద్ది సేపటికే ఎలన్‌మస్క్ అకౌంటే అని పోల్చుకున్నారు.
షేర్లు అమ్ముతానంటూ మొదలు
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో ఎలన్‌మస్క్‌కి 17 కోట్లకు పైగా షేర్లు ఉన్నాయి. ట్యాక్స్ ఇబ్బందులు తొలగించుకునేందుకు ఇందులో పది శాతం షేర్లను అమ్మలని ఆలోచిస్తున్నట్టు.. ఈ నిర్ణయానికి మీరు మద్దతిస్తారా ? అంటూ నవంబరు 6న ట్విట్టర్‌లో ఎలన్ మస్క్ తన ఫాలోవర్లను కోరారు. ఎలన్ మస్క్ ప్రశ్నకు ఫాలోవర్లు భారీ స్థాయిలో స్పందిస్తున్న క్రమంలో ఆయన డిస్‌ప్లే పేరు మార్చేశారు. పేరు మార్పుకు గల కారణాలను ఎక్కడా వివరించలేదు.
ఆ పద్దతిలో ప్రచారం
అయితే డాగీకాయిన్ కో ఫౌండర్ షిబేతోషి నకమోటో ఈ పేరు మార్పుపై స్పందించారు. డాగీ కాయిన్ (Dogecoin)కి అనగ్రామ్ ( ఒక పదంలో ఉన్న అక్షరాలతో మరో పదం రాయడం)గా ఎలన్‌మస్క్ లార్డ్ ఎడ్జ్ (Lorde Edge) అని పెట్టుకున్నట్టు విశ్లేషించారు. బిట్‌కాయిన్, ఇథరమ్ తదితర క్రిప్టోకరెన్సీలు రాజ్యమేలుతున్న సమయంలో ఎలన్‌మస్క్ కొత్తగా వచ్చిన డాగీకాయిన్‌లో పెట్టుబడులు పెట్టారు. దీంతో డాగీకాయిన్ విలువ అమాంతం పెరిగిపోవడమే కాకుండా ఫుల్ పబ్లిసిటీ వచ్చింది.
lorde edge is an anagram for elder doge
— Shibetoshi Nakamoto (@BillyM2k) November 8, 2021
గతంలో
తను పెట్టుబడులు పెట్టిన డాగీ కాయిన్‌కి మరింత ఊతం ఇచ్చేందుకు వీలుగా ఎలన్‌మస్క్ అనాగ్రామ్ పద్దతిలో లార్డ్ ఎడ్జ్ అని పేరు పెట్టుకున్నాడనే వివరణ సరిగానే ఉందని అంతా నమ్ముతున్నారు. గతంలో 2019లో కూడా ట్విట్టర్ డిస్‌ప్లే నేమ్‌ని 1గా పెట్టుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఎలన్ మస్క్.
షేర్లు అమ్మేయండి
ఇక టెస్లా కంపెనీలో తన షేర్లను అమ్మాలా అంటూ ఎలన్ మస్క్ అడిగిన ప్రశ్నకు ట్విట్టర్ యూజర్లు పెద్ద సంఖ్యలో స్పందిపంచారు. ఇందులో ఎక్కువ మంది అంటే 57 శాతం మంది షేర్లు అమ్మేయాలంటూ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment