
న్యూఢిల్లీ: డీసెంట్రలైజ్డ్ లెండింగ్ సేవల సంస్థ పాలీట్రేడ్.. క్రిప్టో ఎక్సేంజ్ ‘కాయిన్‌డీసీఎక్స్’లో లిస్ట్ అయినట్టు ప్రకటించింది. దీంతో ‘ట్రేడ్’ టోకెన్‌లో లిక్విడిటీ పెరుగుతుందని.. 75 లక్షలకు పైగా ఉన్న భారతీయ యూజర్లకు అదనపు ఆదాయ వనరు అందుబాటులోకి వచ్చినట్టు అయిందని పేర్కొంది. చిన్న, మధ్య స్థాయి సంస్థల మూలధన అవసరాలను చేరుకునేందుకు లిస్టింగ్ చేసినట్టు వివరించింది. 2014లో పాలీట్రేడ్ కార్యకలాపాలు మొదలు పెట్టగా.. 5,000కు పైగా రుణ గ్రహీతలు నమోదు చేసుకున్నారు. 250 మందికి 500 మిలియన్ డాలర్లక పైగా రుణాలను మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment