అన్న కుక్కను దువ్వుతుంటే.. తమ్ముడి ఆస్తులు పెరుగుతున్నాయ్‌ | Floki Inu coin surges 55percent after Musk tweet | Sakshi
Sakshi News home page

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ కుక్క ఫొటో ట్వీట్‌..రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్న 'ఫ్లోకి'

Published Wed, Oct 13 2021 12:53 PM | Last Updated on Wed, Oct 13 2021 2:39 PM

Floki Inu coin surges 55percent after Musk tweet  - Sakshi

స్పేస్‌ ఎక్స్‌ సీఈఓ ఎలన్‌ మస్క్‌ పరిచయం అక్కర్లేని పేరు. సింగిల్‌ యాక్షన్‌ సీన్‌తో ఆయా కంపెనీల తలరాతలు మార్చే మేధావి. అందుకే ఆయన ఏం చేసినా సంచలనమే అవుతుంది. అంతెందుకు ఆయన పెంచుకునే పెంపుడు కుక్కను దువ్వినా సరే కోట్లు కురుస్తున్నాయి.అందుకు ఉదాహరణే ఈ సంఘటన.

 

కాయిన్‌ మార్కెట్‌ క్యాప్‌ లెక్కల ప్రకారం..ప్రపంచ వ్యాప్తంగా 200రకాల క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. ఆ వర్చువల్‌ కరెన్సీలను ఎలన్‌ మస్క్‌ సందర్భాన్ని ప్రమోట్‌ చేస్తుంటాడు. ఆ ప్రచారంతో వాటి విలువ అమాంతం పెరిగిపోతుండడం ఇన్వెస్టర్లకు వరంగా మారింది. కొద్ది రోజుల క్రితం ఎలన్‌ మస్క్‌ తన పెంపు కుక్క షిబా ఇను జాతికి చెందిన  'ఫ్లోకి' ని షేర్‌ చేశాడు. అంతే ఎలన్‌ మస్క్‌ తమ్ముడు కింబాల్‌ మస్క్‌ అఫిషియల్‌ పార్ట్‌నర్‌గా ఉన్న క్రిప్టో కరెన్సీ 'ఫ్లోకీ ఇను' కాయిన్‌ వ్యాల్యూ ఒక్కసారిగా పెరిగింది. కేవలం ఈ కాయిన్‌ పై ట్రాన్సాక్షన్లు  ప్రారంభమైన 3 నెలల్లో దాని విలువ 1500 శాతం పెరిగింది.

రాకెట్‌ వేగంతో వ్యాల్యూ 
అక్టోబర్‌ 4 ఫ్లోకి గురించి ఎలన్‌ మస్క్‌  చేసిన ట్వీట్‌తో ఫ్లోకీ ఇను వ్యాల్యూ రోజురోజకీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఆగస్ట్‌ 8 ఆ కాయిన్‌ విలువ $0.00000002 ఉండగా.. ఎలన్‌ ట్వీట్‌తో రెండు నెలల్లో 3,40,150 శాతం పెరిగి అక్టోబర్‌ 8 నాటికి  $0.00006805 చేరింది. ఆ వ్యాల్యూ ఇండియన్‌ కరెన్సీ ప్రకారం రూ.1000 నుంచి రూ.34లక్షలకు పెరిగిందన‍్న మాట.దీంతో ఇన్వెస్టర్లు ఎలన్‌ తన పెంపుడు కుక్కను దువ్వినా తమ్ముడు కింబాల్‌ మస్క్‌కు చెందిన ఫ్లోకీ ఇను కంపెనీ ఆస్తులు పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: వీళ్లిద్దరూ ఏక్‌ నెంబర్‌ 'పిసినారులు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement