మీ పిచ్చి తగలెయ్యా..? ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే చేతిలో డబ్బులుంటే చాలు హైదరాబాద్‌లో చార్మినార్‌ను అంతెందుకు పారిస్‌లో ఉన్న ఈఫిల్ టవర్‌ను ఈజీగా కొనేస్తారు. ఆ పిచ్చితోటే వర్చువల్ రియాల్టీ సంస్థ డిసెంట్రాల్యాండ్‌లో ఔత్సాహికులు 2.4 మిలియన్ల విలువైన క్రిప్టో కరెన్సీతో వర్చువల్ రియల్ ఎస్టేట్ ప్లాట్లను కొనుగోలు చేశారు.
ఏమిటీ డీసెంట్రాల్యాండ్?
డిసెంట్రలైజ్‌డ్ 3డీ వర్చువల్ రియాలిటీ ప్లాట్‌ఫామ్ ఇది.మ్యాప్‌బాక్స్ టెక్నాలజీతో సృష్టించిన వర్చువల్ ల్యాండ్ ఇది. భూగ్రహాన్ని డిజిటల్ గ్రిడ్ లేయర్స్, టైల్స్‌గా విభజిస్తారు. ఈ టైల్స్ విలువ యూఎస్‌లో ఒకరకంగా, ఆస్ట్రేలియాలో ఒక రకంగా, ఇండియాలో ఒకరకంగా ఉంటుంది. దీన్ని డిజిటల్ ఎస్టేట్ అని కూడా పిలుస్తున్నారు. ఈజీగా చెప్పాలంటే ఫేస్‌బుక్ అధినేత జుకర్ బెర్గ్ మెటా పేరుతో కొత్త టెక్నాలజీపై పనిచేస్తున్నారు. ఈ టెక్నాలజీతో మీరు ఎక్కడ ఉన్నా అవతార్ రూపంలో ఎదురుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్ని ఇప్పటికే ఫేస్‌బుక్ ఇంటర్నల్‌గా జరిగే మీటింగ్‌లో ఉపయోగిస‍్తుంది. ఇక డిసెంట్రాల్యాండ్ కూడా అంతే ఇందులో మనకు కావాల్సిన ల్యాండ్స్‌ను, బిల్డింగ్స్‌ను నిర్మించొచ్చు. డిజిటల్ భూభాగంలో కొనవచ్చు. వాటిని డెవలప్ చేయవచ్చు.అమ్మవచ్చు.
జుకర్ దెబ్బకు పెరిగిన డిమాండ్
డిసెంట్రాలాండ్‌లోని ల్యాండ్ ఇతర వస్తువులు నాన్-ఫంగబుల్ టోకెన్‌ల (NFTలు) రూపంలో విక్రయిస‍్తారు. ఇది ఒక రకమైన క్రిప్టోకరెన్సీ తరహాలో డిజిటల్ మనీగా చెప్పుకోవచ్చు. డిసెంట్రాల్యాండ్‌లో కరెన్సీ 'మన' రూపంలో కొనుగోలు చేయొచ్చు. సోమవారం 618,000 కరెన్నీతో రియల్ ఎస్టేట్ ప్లాట్ల అమ్మకాలు జరిగాయి. వాటి విలువ సుమారు $2,428,740 అని డీసెంట్రాల్యాండ్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ డిజిటల్ భూమిలో 6,090 వర్చువల్ చదరపు అడుగుల పరిమాణంలో ఒక్కొక్కటి 52.5 చదరపు అడుగులో 116 చిన్న చిన్న ప్లాట్లను తయారు చేశారు. అయితే వాటిని పలువురు ఔత్సాహికులు 2.4 మిలియన్ల తో కొనుగోలు చేశారు. కాగా మెటావర్స్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నట్లు జుకర్ ప్రకటించారు. ఆ ప్రకటనతో డిసెంట్రాల్యాండ్‌లో డిజిటల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అదే సమయంలో డిసెంట్రాల్యాండ్‌కు చెందిన అధికారిక కరెన్సీ 'మన' వ్యాల్యూ 400శాతం పెరిగినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment