ఆసక్తిగా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ 2022.. మేజర్ వర్గాలను తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. బడ్జెట్ పరిణామాలు.. స్టాక్ మార్కెట్‌పై కొన్ని గంటలు ప్రతికూల ప్రభావం చూపాయి కూడా. ఈ క్రమంలో బిగ్‌బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇంట మరోసారి కాసుల వర్షం కురిసింది. టాటా గ్రూప్ టైటాన్ కంపెనీ స్టాక్ ధరలు లాభాల బాట పట్టడంతో ఏకంగా 342 కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడాయన.
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌పోలియోలోని టైటాన్ కంపెనీ స్టాక్ ధరలు ఫిబ్రవరి 1వ తేదీన ఇన్వెస్టర్లకు విపరీతమైన లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో బడ్జెట్ ప్రసంగం తర్వాత కాసేపు మార్కెట్ డౌన్ కాగా.. కొన్ని గంటల తర్వాత పుంజుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీన టైటాన్ స్టాక్ ధర మధ్యాహ్నాం 1గంట సమయంలో 2,358రూ. టచ్ అయ్యి.. క్లోజింగ్ 2,436రూ. వద్ద ముగిసింది. ఇది జనవరి 31 తేదీన ముగింపు ధర కంటే 75రూ. ఎక్కువ.
ఈ ధరతో 61 ఏళ్ల వయసున్న రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సంపద.. మరో 342 కోట్లు పెరిగింది. ప్రస్తుతం ఆయన మొత్తం ఆస్తి విలువ 6బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే!
చైనా రూట్‌లో వెళ్తున్నామా?
ఇదిలా ఉంటే స్టాక్‌మార్కెట్‌లో అతిపెద్ద ప్రైవేట్ ఇన్వెస్టర్‌గా పేరున్న రాకేష్ ఝున్‌ఝున్‌వాలా బడ్జెట్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందంటూ పేర్కొన్న ఆయన.. మరోవైపు క్రిప్టో విషయంలో మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ 2022 భారత్‌లో క్రిప్టోకరెన్సీకి చావు దెబ్బలాంటిదని వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో భారత్.. పొరుగు దేశం చైనాను ఫాలో అవుతున్నట్లు ఉంది. అక్కడి డిజిటల్ కరెన్సీ నిబంధనలను పాటిస్తున్నట్లు అనిపిస్తోంది. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేసే ఉద్దేశం వల్ల ఇతర క్రిప్టోలను అంతం అవుతాయి. అసలు క్రిప్టోకరెన్సీ బిల్లు పార్లమెంట్‌కు రాకముందే ఈ తరహా నిర్ణయం తీసుకోవడమే అందుకు నిదర్శనం. అఫ్‌కోర్స్.. ఒక రకంగా ఈ రూట్‌లో వెళ్లడమే సరైంది కూడా’’ అంటూ కామెంట్లు చేశారాయన.
Comments
Please login to add a commentAdd a comment