ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీకి భారీ ఆదరణ లభిస్తోంది. పలు దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అనేక దేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ.. ఆయా దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు.
భారతే నెంబర్ వన్....!
క్రిప్టోకరెన్సీను అనుమతించాలా..! వద్దా..! అనే విషయంపై భారత ప్రభుత్వం సందిగ్ధంలో ఉండగా.. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తున్న వారిలో భారత్ నెంబర్ వన్‌గా నిలిచినట్లు ప్రముఖ బ్రోకింగ్ అండ్ ట్రేడింగ్ ఫ్లాట్‌ఫాం బ్రోకర్ చూసర్ వెల్లడించింది. భారత్‌లో సుమారు 10.07 కోట్ల మంది క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు బ్రోకర్ చూసర్ పేర్కొంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటారనే పేరున్న అమెరికాలో కేవలం 2.74 కోట్ల మందే క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ దేశం రెండో స్థానానికే పరిమితమైంది. ఇండియా, అమెరికా తర్వాత స్థానాల్లో రష్యా(1.74 కోట్లు), నైజీరియా(1.30 కోట్లు) నిలిచాయి.
చదవండి: అదృష్టమంటే ఇదేనెమో..! 4 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు సొంతం...!
వివిధ రకాల క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లను ఆయా దేశాల జనాభాతో పోలిస్తే భారత్ 7.30శాతం ఇన్వెస్టర్లతో ఐదో స్థానంలో నిలిచింది. రష్యా (11.91%), కెన్యా (8.52%), యుఎస్ (8.31%)గా ఉన్నారు. 12.73 శాతం ఇన్వెస్టర్లతో ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉంది. పోర్టల్ బ్రోకర్‌చూసర్ తన వార్షిక క్రిప్టో విస్తరణ సూచికతో చేసిన పరిశోధనలో ఈ విషయాలను బయటపెట్టింది. వాస్తవానికి టెక్నాలజీని వాడటం, ఇన్వెస్ట్ చేయడంలో పాశ్యత్య దేశాలతో పోల్చితే భారతీయులు వెనుకే ఉంటారు. సంప్రదాయ బద్దంగా రియల్టీ, బంగారం, ఎఫ్‌డీలలోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టేవారు. కానీ క్రిప్టో విషయానికి వచ్చేసరికి పాత సంప్రదాయాన్ని బద్దలు కొడుతున్నారు. పాశ్యాత్య దేశాలను సవాల్ విసురుతూ అన్నింటా అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నారు.
చదవండి: కాసుల కోసం కక్కుర్తి..! వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్..!
స్టాక్స్ వద్దు..డిజిటల్ కరెన్సీ ముద్దు...!
స్టాక్స్, మ్యూచుఫల్ ఫండ్స్, గోల్డ్ వంటి కంటే ఎక్కువగా డిజిటల్ కరెన్సీపై భారీగా లాభాలను గడించవచ్చునని భారత ఇన్వెస్టర్లు అనుకుంటున్నట్లు బైయూకాయిన్ సీఈవో శివమ్ ఠక్రమ్ పేర్కొన్నారు. అందువల్లే డిజిటల్ కరెన్సీ భారత ప్రజలను భారీగా ఆకర్షిస్తోందని వారు చెబుతున్నారు. క్రిప్టోకరెన్సీ లాంటి డిజిటల్ కరెన్సీలో భారత్‌లోని 25 నుంచి 40 మధ్య వయసు వారు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఇప్పటికే చైనాలసిస్ పేర్కొన్న విషయాన్ని ఠక్రమ్ గుర్తుచేశారు. ప్రపంచంలోని గొప్ప క్రిప్టోకరెన్సీ ఐనా బిట్‌కాయిన్ ఈ ఏడాదిలో 50శాతం కంటే ఎక్కువ మేర లాభపడింది.
చదవండి: జీవిత భాగస్వాములపై నిఘా..! గూగుల్ కీలక నిర్ణయం...!
Comments
Please login to add a commentAdd a comment