ఎడెల్వీజ్ చేతికి జేపీ మోర్గాన్ ‘ఫండ్’ | Edelweiss to buy JPMorgan's mutual fund business in India | Sakshi
Sakshi News home page

ఎడెల్వీజ్ చేతికి జేపీ మోర్గాన్ ‘ఫండ్’

Published Wed, Mar 23 2016 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

ఎడెల్వీజ్ చేతికి జేపీ మోర్గాన్  ‘ఫండ్’

ఎడెల్వీజ్ చేతికి జేపీ మోర్గాన్ ‘ఫండ్’

డీల్ విలువ రూ. 110 కోట్లు!
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల దిగ్గజం జేపీ మోర్గాన్‌కు భారత్‌లో ఉన్న మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఎడెల్‌వీజ్ అసెట్ మేనేజ్‌మెంట్ మంగళవారం తెలిపింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 110 కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ ఫండ్ దాదాపు రూ. 7,000 కోట్ల పైచిలుకు అసెట్స్‌ను నిర్వహిస్తోంది. డీల్ అనంతరం ఏర్పడే సంయుక్త సంస్థ ఆధ్వర్యంలో దాదాపు రూ. 8,757 కోట్ల అసెట్స్ ఉంటాయి. జేపీ మోర్గాన్  అసెట్ మేనేజ్‌మెంట్ ఇండియాకి సంబంధించిన మెజారిటీ ఉద్యోగులను తీసుకోనున్నట్లు ఎడెల్‌వీజ్ ఒక ప్రకటనలో తెలిపింది.  దాదాపు రూ. 13 లక్షల కోట్ల విలువ చేసే భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నుంచి గత కొన్నాళ్లుగా పలు అంతర్జాతీయ సంస్థలు వైదొలుగుతున్నాయి. ఈ కోవలో జేపీ మోర్గాన్ 11వది. రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ గతేడాది గోల్డ్‌మన్ శాక్స్ భారత ఫండ్ వ్యాపారాన్ని రూ. 243 కోట్లకు కొనుగోలు చేసింది. స్టాండర్డ్ చార్టర్డ్ తన ఫండ్ వ్యాపారాన్ని 2008లో ఐడీఎఫ్‌సీకి విక్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement