
'హోదా' కోసం అక్టోబర్ 7 నుంచి వైఎస్ జగన్ దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చేనెల 7వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తారని పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చేనెల 7వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తారని పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. గుంటూరులోనే ఆయన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆయన ఏమన్నారంటే...
- ఎవరైనా చచ్చిపోతానని దరఖాస్తు పెడితే దానికి అనుమతిస్తామా అని చంద్రబాబు మాట్లాడుతున్నారు
- ఆయన అవహేళనగా, అహంభావంతో మాట్లాడుతున్నారు
- ప్రత్యేక హోదా అంశంపై అసలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో ప్రజలు ఆలోచించాలి
- కేంద్రం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి దీక్ష చేపడితే ఇలా మాట్లాడతారా?
- 2010లో మీరు హైదరాబాద్లో నిరవధిక నిరాహార దీక్ష చేయలేదా
- అప్పట్లో ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరలేదా
- అప్పుడు మీరు చనిపోవడానికి దీక్ష చేశారా, లేదా రోజూ భోజనం చేసి ప్రజలను మోసం చేసి దీక్ష చేసినట్లు చూపించారా
- అప్పుడు ఏ చట్టం మీకు అనుమతి ఇచ్చిందని ప్రశ్నిస్తున్నా
- నిరాహార దీక్ష వల్లే, శాంతియుత పోరాటం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని మర్చిపోవద్దు
- పొట్టి శ్రీరాములు చేసిన దీక్ష వల్లే తెలుగు రాష్ట్రం ఏర్పడింది
- ఇప్పుడు మనం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో బతుకుతున్నామంటే అప్పటి పెద్దలు చేసిన త్యాగాలే కారణం
- శాంతియుతంగా, చట్టబద్ధంగా చేస్తున్న కార్యక్రమాన్ని కళ్లు నెత్తికెక్కి అవహేళన చేస్తున్నారు
- ఎవరైనా సరే ఒకసారి ఎన్నికైతే ఐదేళ్లే సీఎం అవుతారు తప్ప శాశ్వత సీఎం అనుకుంటే కాలగర్భంలో కలిసిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి
- చంద్రబాబు ఇలాంటి అహంభావపూరితమైన మాటలు మాట్లాడటం మంచిది కాదు
- ఏది ఏమైనా.. నిరాహార దీక్ష చేయాలని పార్టీ నిర్ణయించుకుంది
- వచ్చే నెల 7వ తేదీన గుంటూరులో వైఎస్ జగన్ దీక్ష ప్రారంభిస్తారని పార్టీ నిర్ణయించింది
- నేను, పార్టీ పెద్దలు ఎస్పీ, ఐజీ స్థాయి అధికారులను అనుమతి కోరాం.. వాళ్లు ఇక్కడ కాదు, వేరే స్థలం చూసుకోండి అని చెప్పారు
- మేం భేషజాలకు పోదలచుకోలేదు. రాష్ట్ర అభివృద్ధే మాకు ముఖ్యం
- గతంలో మేం ఎంచుకున్న ప్రదేశం అయితే ఇబ్బంది అవుతుందన్నారు కాబట్టి ప్రత్యామ్నాయ స్థలాన్ని వాళ్లకు చూపిస్తాం
- స్వార్థం, స్వలాభం కోసం మాటలు చెబితే ప్రజలు క్షమించరు
- స్వార్థం కోసం, మీ అవినీతి కోసం సింగపూర్ బృందాన్ని తీసుకొస్తున్నారు
- ఈ విషయాన్ని ప్రజలు కూడా త్వరలోనే తెలుసుకుంటారు
- ప్రధాన ప్రతిపక్షంగా మా వంతు బాధ్యతగా ప్రజల కోసం, ప్రజల తరఫున పోరాడతాం