సాక్షి, కాకినాడ : సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్ష కీలకఘట్టమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆమె దీక్షతో రాజకీ య పార్టీలకు కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో అందరికీ సమన్యాయం జరగాలని, లేదంటే సమైక్య రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించాలనే విజయమ్మ డిమాండ్‌తో వీరంతా గొంతు కలిపారు. ఆమరణ నిరాహార దీక్ష నిర్ణయాన్ని అభినందించారు. సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సూర్యకళా మందిరంలో మంగళవారం ‘ఎవరెటు’ చైతన్యపథం చర్చా వేదిక నిర్వహించారు. వివిధ రంగాల నిపుణులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యావేత్తలు, విద్యార్థులు, గృహిణులు పాల్గొని సమైక్యాంధ్ర కోసం గళమెత్తారు.
‘తెలంగాణ ఉద్యమం కేవలం కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం చేసింది, కానీ సీమాంధ్రలో ప్రస్తుతం జరుగుతున్నది ప్రజాఉద్యమం.. తెలుగువారి ఆత్మగౌరవం.. ఐక్యతల కోసం సాగిస్తున్నది. ఈ పోరు సమైక్యాంధ్రను సాధించుకునేంత వరకు ఎవరెన్ని కుట్రలు..కుతంత్రాలకు పాల్పడినా ఆగే ప్రసక్తే లేదు’ అంటూ వక్తలు తెగేసి చెప్పారు. పెద్ద రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల దుస్థితి ఏవిధంగా ఉందో కళ్లారా చూస్తున్నామన్నారు. తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలన్నదే మా అభిమతం.. అందుకోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడం.. ఎన్నినెలలైనా సమ్మె చేస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం పేర్కొన్నారు. విజయమ్మ దీక్షను చూసి నేటి రాజకీయవేత్తలు సిగ్గెరిగి వ్యవహరించాలని కాకినాడ జీజీహెచ్ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ యు.రాఘవేంద్రరావు కోరారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడగొట్టడం వల్ల దేశ సమైక్యత దెబ్బతింటోందని జేఎన్‌టీయూకే రెక్టార్ ప్రొఫెసర్ పి.ప్రభాకరరావు అభిప్రాయపడ్డారు.
ఎటు ఓటుంటే అటు ఉంటున్నారు
రాజకీయ నాయకులు ఎటు ఓటు ఉంటే అటు మాట్లాడుతున్నారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా రాష్ర్ట విభజన చేస్తే చెల్లుబాటుకాదు. ఒకవేళ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందినా సుప్రీం కోర్టుకు వెళ్తే అది నిలబడదు. రాష్ర్టం సమైక్యంగా ఉంచడమే ప్రస్తుత సమస్యకు పరిష్కారమార్గం.
- జవహర్ అలీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు
జల వివాదాలు ఏర్పడ తాయి
రాష్ర్ట విభజన జరిగితే ముం దుగా తెలుగువారు సాగు, తాగునీటి కోసం కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది.ఇప్పటికే జలవివాదాలతో పొరుగు రాష్ట్రాలతో పోరాడుతున్నాం. ఇలాంటి సున్నితమైన అంశాలపై ముందుగా ఏకాభిప్రాయం సాధించిన తర్వాత విభజించినా ఎవరికీ అభ్యంతరం ఉండదు.
- వి.సంధ్య, ప్రముఖ విద్యావేత్త
విజయమ్మ దీక్ష కీలక ఘట్టం
Published Wed, Aug 21 2013 4:15 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
Advertisement
Advertisement