మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ కోరారు.
విజయవాడ: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ కోరారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ లోగా కమిషన్ నివేదిక వస్తుందని నారాయణ తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ ముద్రగడ ఆమరణ నిరహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.
ఆయన చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ముద్రగడ దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రిలే దీక్షలు, ఆందోళనలు ముమ్మరంగా సాగుతున్నాయి.