పెల్లుబికిన నిరసన
జగన్‌దీక్ష భగ్నం చేయడాన్ని నిరసిస్తూ గాజువాకలో వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డితోపాటు పార్టీశ్రేణులు స్టీల్‌ప్లాంట్ గేటు ఎదురుగా కూర్మన్నపాలెం సెంటర్‌లో ధర్నా చేశారు. మునగపాకలో మంత్రులు కామినేని శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావుల దిష్టిబొమ్మలను చెప్పులతో కొడుతూ ఊరేగించారు. అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ ఇక్కడి ఆందోళనలో పాల్గొన్నారు.యలమంచిలిలోని వైఎస్సార్ కూడలిలో జరిగిన ఆందోళనలో పార్టీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు..పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.
జగన్ క్షేమం కోరుతూ పాయకరావు పేటలో శ్రీరాధారుక్మిణి సహిత పాండురంగస్వామి దేవస్థానంలో 101 కొబ్బరి కాయుల కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెడ్పీ ప్లోర్ లీడర్ చిక్కాల రామారావు తదితరులు పాల్గొన్నారు.నర్సీపట్నంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు.మాకవారపాలెంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట విద్యార్థులు రాస్తారోకో చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ గత ఏడు రోజులుగా వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను భగ్నం చేయడం ప్రభుత్వానికి తగదని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అన్నారు. దీక్షను భగ్నం చేయడం పట్ల అరకులో ఆయన నిరసన వ్యక్తం చేశారు.{పభుత్వ తీరుపై పాడేరు ఎంఎల్‌ఎ గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించారు.
హుకుంపేటలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్ జగన్ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రత్యేక హోదా కోసం ఉద్యమం సాగిస్తారని పార్టీ నేతలు పేర్కొన్నారు.