ఉద్యమ స్ఫూర్తి
వైఎస్ జగన్ దీక్షకు వెల్లువెత్తిన వివిధ వర్గాల మద్దతు
► అ నియోజకవర్గాల్లో సంఘీభావ దీక్షలు
ప్రారంభించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు
► వాషింగ్టన్‌లో పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నిరాహార దీక్షలు
► దర్గాలో ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం పెద్దలు
► ర్యాలీలతో కిక్కిరిసిన గుంటూరు నగర రహదారులు
► జగన్‌తో సెల్ఫీలు తీసుకున్న యువతీయువకులు
► ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పేరుపేరునా పలకరించిన జగన్
జననేత జగన్‌కు మద్దతుగా దారులన్నీ జన ఏరులవుతున్నాయి...
అన్ని వర్గాలు ఉద్యమ స్ఫూర్తితో రగులుతున్నాయి...
మన కోసమే దీక్ష చేపట్టారంటూ ఉరుకుతున్నాయి...
ప్రత్యేక హోదాతోనే ప్రగతి సాధ్యమని నమ్ముతున్నాయి...
కదనరంగానికి అన్నట్టు దీక్షాప్రాంగణానికి కదులుతున్నాయి...
సంకల్ప సిద్ధిని కాంక్షిస్తూ విపక్ష నేత నుదుట సిందూరం దిద్దుతున్నాయి...
మీ పక్షానే మేము... మీ బాటను వీడబోమంటూ బాస చేస్తున్నాయి..
ఈ పోరాటంలో మీ శ్వాసకు ఊపిరిమవుతామంటూ
భరోసా నిస్తున్నాయి..
ఆశయ సాధనలో జగన్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాయి...
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఉదయం 7.30 గంటల సమయంలో దీక్షకు కూర్చున్న జగన్ చెరగని చిరునవ్వుతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పదేళ్ల చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు జగన్‌ను కలసిన వారిలో ఉన్నారు. కొందరు తమ కష్టాలు, బాధలు చెప్పుకుంటే, మరికొందరు రాష్ట్ర భవిష్యత్ కోసం జగన్ చేపట్టిన దీక్షకు సంఘీభావం పలికారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ, లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు గద్దె వెంకటేశ్వరరావు, జీజీహెచ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం, జిల్లా రెల్లి కులస్తుల సంఘం, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు, రాజధాని రైతులు, వ్యవసాయ కార్మికులు జగన్‌ను కలసి తమ సంఘీభావం తెలిపారు.
మద్దతు తెలిపిన ముస్లిం పెద్దలు...
ముస్లిం పెద్దలు జగన్ ఆరోగ్యం కోసం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయన పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీనేతలు, కార్యకర్తలు నిరాహార దీక్షలు ప్రారంభించారు. మరో వైపు వాషింగ్టన్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్‌ఆర్‌ఐ విభాగ ప్రతినిధులు జగన్ దీక్షకు మద్దతుగా నిరాహార దీక్షలు చేపట్టారు. ఎక్కడో ఉండి జగన్ దీక్షకు మద్దతు పలికిన ఎన్‌ఆర్‌ఐ విభాగాన్ని పార్టీ సభాముఖంగా అభినందించింది.
ఓ చిన్నారికి విజయమ్మగా నామకరణం
ఉదయం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వివిధ వర్గాల ప్రజలు జగన్‌ను వ్యక్తిగతంగా కలుసుకున్నారు. కొందరు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించి దీక్షకు చేరుకోవడంతో నగరంలోని రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. యువతీ యువకులు జగన్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహం చూపారు. స్థానిక స్వర్ణభారతీ నగర్‌కు చెందిన షేక్ మస్తాన్ బీ తన కుమార్తెకు జగన్‌తో విజయమ్మ అని నామకరణం చేయించుకుంది.
ఆకట్టుకున్న వైఎస్సార్ సీపీ నేతల ప్రసంగాలు..
పార్టీకి చెందిన పలువురు సీనియర్ నా యకులు ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్ర యోజనాలు, చంద్రబాబు మోసపూరిత విధానాలపై చేసిన ప్రసంగాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఉద్యోగం కావాలన్నా, సాగునీరు కావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, వస్తువుల రేట్లు తగ్గాలన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పదని, దాని సాధన కోసం ఐక్యంగా పోరాటం సాగిద్దామన్న నేతల ప్రసంగాలకు ప్రజలు సాను కూలంగా స్పందించి జగన్ వెన్నంటి ఉంటామన్నా రు. నేతల ప్రసంగాలు లేని సమయాల్లో ప్రత్యేకంగా రూపొందించిన జగన్ ప్రసంగాలను ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ప్రదర్శిం చారు. చట్టసభల సాక్షిగా మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబా బు ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మోసగించిన విధానాలను ఈ స్క్రీన్‌లపై చూపారు. వీటికి స్పందించిన విద్యార్థుల ఈలలు, చప్పట్లు, కేకలతో శిబిరం దద్దరిల్లింది. పార్టీ రూపొందించిన ప్రత్యేక పాటలు, వంగపండు ఉష బృందం సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీక్ష రెండవ రోజు కావడంతో ప్రభుత్వ వైద్యుల బృందం జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించింది.
పోటెత్తిన జనం
ఉదయం నుంచే దీక్షా శిబిరం వద్ద జనం పోటెత్తారు. ఉదయం 7.30 గంటల ప్రాం తంలో దీక్షలో పాల్గొన్న జగన్ అప్పటికే శిబిరంలో వేచి ఉన్న ప్రజలను కలుసుకునే అవకాశం కల్పించారు. వివిధ వర్గా ల ప్రజలు వేదికపై ఉన్న జగన్‌ను కలుసుకుని అభినందనలు తెలిపారు. దీక్ష ముగి సే వరకు ఆయన నాయకులు, కార్యకర్తలు, విద్యార్థినీ, విద్యార్థులను పేరుపేరునా పలకరించారు. పార్టీ సీనియర్లతో చర్చించారు. సాయంత్రం జిల్లాలోని వివిధ ని యోజకవర్గాలతో పాటు నగరంలోని ప్రజలంతా ఒకేసారి శిబిరం వద్దకు చేరుకోవడంతో ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. వేదికపై ఉన్న జగన్‌ను చూసేం దుకు కొందరు అభిమానులు కుర్చీలపైకి ఎక్కడంతో కొన్ని విరిగిపోయాయి. ఒక దశలో పోలీసులు వారిని నియంత్రించలేని పరిస్థితి నెలకొంది.
‘కేంద్రం కదిలివస్తుందనే నమ్మకం ఉంది’..
ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి వచ్చిన బి. వెంకటరమణ ప్రత్యేక హోదా సాధనకు కృషి చేస్తున్న జగన్‌కు మద్దతుగా నిలుస్తానన్నారు. ఆయన దీక్షకు కేంద్రం కదలివస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. కృష్ణాజిల్లా జి.కొండూరుకు చెందిన జి.రంజిత్ మాట్లాడుతూ జగన్ చేస్తున్న దీక్షకు చివర వరకు అండగా ఉంటానని, ఎన్ని ఉద్యమాలు, కార్యక్రమాలు చేసినా పాల్గొంటానని చెప్పారు. ముఖ్యమంత్రి మాటలు ఎవరూ విశ్వసిం చడం లేదన్నారు. శిబిరంలో వైఎస్సార్ సీ పీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, గుం టూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), కోన రఘుపతి, నేతలు మేరుగ నాగార్జున, ఎండీ నసీర్ అహ్మద్, రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), ఆతుకూరి ఆంజనే యులు, కావటి మనోహరనాయుడు, పోలూరి వెంకటరెడ్డి, లావు శ్రీకృష్ణదేవ రాయులు, నూనె ఉమామహేశ్వరరెడ్డి, షేక్ గులాం రసూల్, మొగిలి మధు, సయ్యద్‌మాబు, బండారు సాయిబాబు, కొత్తా చిన్నపరెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణా రెడ్డి, ఉత్తమ్‌రెడ్డి, దేవళ్ల రేవతి, అంగడి శ్రీనివాసరావు, కొలకలూరి కోటేశ్వరరావు, డైమండ్‌బాబు, శిఖా బెనర్జీ, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, కోట పిచ్చిరెడ్డి, ఆతుకూరి నాగేశ్వరరావు, గనిక ఝాన్సీరాణి, పల్లపు రాఘవ, పానుగంటి చైతన్య, షేక్ జానీ, ఆవుల సుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జగన్ పోరాటస్ఫూర్తి అభినందనీయం
రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వై.ఎస్.జగన్ చేస్తున్న నిరాహార దీక్ష, ఆయన పోరాట స్ఫూర్తి అభినందనీయం. చరిత్ర గల గుంటూరులో నిరాహార దీక్ష చేయడం హర్షనీయం. రాష్ట్రం తిరిగి కోలుకోవాలంటే ప్రత్యేక హోదా కచ్చితంగా ఇవ్వాల్సిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవర్చలేదు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి కచ్చితంగా సంజివినే.
- గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రాయచోటి
ఓటుకు కోట్లు కేసులో బాబు నగ్నంగా దొరికాడు
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నగ్నంగా దొరికారు. దాని నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని మోదీ వద్ద తాకట్టు పె ట్టారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాన మంత్రి ఇచ్చిన హామీ అమలు చేయకపోతే పార్లమెంటు వ్యవస్థపై నమ్మకం పోతుంది. పార్లమెంటులో ఐదు సంవత్సరాలు ఇస్తామంటే కాదు పది సంవత్సరాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీజేపీ ఇప్పుడు మాట మారుస్తుంది.
- జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే , గురజాల
చంద్రబాబుది బాధ్యతారాహిత్యం
ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు. అటువంటి హోదా సంజీవిని కా దని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం హేయం. ప్రత్యేక హోదా కోసం బీజేపీపై పోరాటం చేయాల్సిన చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే వైఎస్ జగన్ చేస్తున్న దీక్షకు ప్రజలు మద్దతు పలకాలి. హోదా సాధించుకోవాలి.
- కొత్తా చిన్నపరెడ్డి, వైఎస్సార్ సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు
మంత్రులు భాష మార్చుకోకుంటే బుద్ధి చెబుతాం
ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న వై.ఎస్.జగన్ పై రాష్ట్ర మంత్రులు సిగ్గు లేని భాష మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాకపోగా, దీక్ష చేస్తున్న జగన్‌ను విమర్శించడం మంత్రుల అవివేకానికి నిదర్శనం. మంత్రి దేవినేనికి వంద జన్మలెత్తినా జగన్‌ను విమర్శించే అర్హత రాదు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చి నిరుద్యోగ సమస్య తీరుతుంది. దీక్షకు లక్షలాది మంది ప్రజలు సంఘీభావం తెలపాలి. - బొల్లా బ్రహ్మనాయుడు, వైఎస్సార్ సీపీ వినుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి
ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా..?
ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా.. చంద్రబాబు పాలనా ఫలితమో.. అయ్యగారి జాతకమేమిటోగానీ వస్తూనే కరువు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసే నాయకుడి మీద మంత్రులు అవాకులు చెవాకులు పేలుతున్నారు. జగన్ చేస్తున్న దీక్ష దగ్గరకు వచ్చి దీక్ష నాటకమని మాట్లాడితే ప్రజలు చెప్పులతో కొడతారు. చంద్రబాబు క్యాబినెట్ స్వార్ధపరుల గుంపు. వీల్లు రాజకీయ నాయకులు కాదు.. రాజకీయ రాబంధులు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి హెరిటేజ్‌కు లాభాలు వస్తున్నాయి. చంద్రబాబు రోబో లాంటివాడు.
- వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి