రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆయనకు ఉస్మానియా వైద్యులు పరీక్షలు చేశారు. వైఎస్ జగన్ డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని, ఆయన బాగా నీరసించి పోయారని, గొంతు కూడా ఏమాత్రం సహకరించట్లేదని ఉస్మానియా ఆస్పత్రి అదనపు మెడికల్ సూపరింటెండెంట్ రంగనాథ్ తెలిపారు.
ఆయన మూత్రంలో కీటోన్ బాడీస్ ఉన్నాయని, అందువల్ల వెంటనే జగన్ను ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయాలని డాక్టర్ రంగనాథ్ చెప్పారు. జగన్ ఇలాగే దీక్ష కొనసాగిస్తే శరీరంలోని అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని, కిడ్నీలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉందని, అందువల్ల ఆయన వెంటనే ప్లూయిడ్స్ తీసుకోవాలని వివరించారు. జగన్ ఆరోగ్య పరిస్థితి నివేదికను పోలీసు అధికారులకు డాక్టర్లు అందజేశారు.
మరోవైపు ఆరోగ్యం క్షిణిస్తున్నా లెక్కచేయకుండా జగన్ దీక్ష కొనసాగిస్తున్నారు. తనకు సంఘీభావం తెలిపేందుకు రాష్టం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులను చిరునవ్వుతో పలకరిస్తున్నారు. జగన్ను కలిసి పలువురు నాయకులు మద్దతు తెలిపారు.
జగన్కు ఆస్పత్రిలో చికిత్స చేయాలి: వైద్యులు
Published Tue, Oct 8 2013 8:46 PM | Last Updated on Wed, Aug 8 2018 5:45 PM
Advertisement