కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం సంతపల్లి గ్రామ శివారులో బుధవారం మిడ్‌మానేరు ముంపు గ్రామాల ప్రజలు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.
వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం సంతపల్లి గ్రామ శివారులో బుధవారం మిడ్‌మానేరు ముంపు గ్రామాల ప్రజలు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షలో సుమారు 12 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ముంపు గ్రామాల ప్రజలు చేపట్టిన దీక్షకు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.
మిడ్‌మానేరు ముంపు గ్రామాల ప్రజలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని, మరో రెండు డిమాండ్‌లు కూడా నెరవేర్చాలని బాధితులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.