
కిర్లంపూడిలో హై టెన్షన్, పోలీసుల మోహరింపు
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో హై టెన్షన్ నెలకొంది. తుని సంఘటన నేపథ్యంలో కేసులను ఎత్తివేయాలని డిమాండ్ తో కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిర్లంపూడి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎర్రవరం, పత్తిపాడు, కిర్లంపూడిలో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కిర్లంపూడి వచ్చే వ్యక్తులను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ముద్రగడకు సంఘీభావంగా కాపులు పెద్ద ఎత్తున కిర్లంపూడికి తరలి వస్తున్నారు.
కాగా తునిలో జనవరి 31న కాపు ఐక్యగర్జన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ముద్రగడను ఏ-1గా చేరుస్తూ 76 కేసులు నమోదు చేసినట్టు సమాచారం.